సైరా సినిమా విడుదలయింది. విశాఖ బయ్యర్ మినహా రెండు రాష్ట్రాల్లోని ప్రతీ బయ్యర్ ఇంతో అంతో నష్టపోయారు తప్ప, రూపాయి లాభం చేసుకున్నది లేదు. అలాగే ఇక కన్నడ, మలయాళ, హిందీ వెర్షన్ల సంగతి అయితే చెప్పనక్కరలేదు. డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రస్ అయ్యాయి. ఆఖరికి ఓవర్ సీస్ బయ్యర్ కూడా భారీ నష్టాలు మూట కట్టకున్నారు.
ఆరంభంలో ఫిక్స్ డ్ హయ్యర్లు, అడ్వాన్స్ లు లాంటివి కలిపేసి ఫిగర్లు చూపించారు. కానీ ఇప్పుడు థియేటర్ల అడ్వాన్స్ లు సరిపోక, వెనక్కు ఇవ్వాల్సి వుంది బయ్యర్లు. కానీ ఆ లెక్కలు ఇప్పుడేవీ మళ్లీ మరోసారి ఎలాగూ సరిచేయరు. ఆరంభంలో ఎవ్వరూ పైకి మాట్లాడలేదు కానీ, ఇప్పుడు ఆఫ్ ది రికార్డుగా ఇంత పోయింది అంత పోయింది అంటున్నారు బయ్యర్లు.
ఇలాంటి టైమ్ లో బయ్యర్లను ఆదుకునే ఆలోచనలు చేయకుండా, అర్జెంట్ గా ఇంటర్వూలు ఇచ్చే పని పెట్టుకున్నారు నిర్మాత రామ్ చరణ్ అని తెలుస్తోంది. తెలుగునాట పాపులర్ అయిన రెండు పత్రికలను, తెలంగాణలో తప్పదు కనుక ఓ పత్రికను, అలాగే పనిలో పనిగా ఓ ఆంగ్ల పత్రికను అర్జెంట్ గా పిలిచి ముచ్చటించి పంపారట రామ్ చరణ్.
ఆ ముచ్చట్ల వైనాలు ఎలాగూ వస్తాయి. అది వేరే సంగతి. నిజానికి ఎవరైనా సినిమాకి ముందు ప్రచారం చేస్తారు లేదా, సినిమా నడుస్తుంటే ప్రచారం సాగిస్తారు. కానీ అలా కాకుండా చాలా చోట్ల రన్ పూర్తయి, లేదా కొన్ని చోట్ల డెఫిసిట్ కు చేరిన తరువాత చరణ్ ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయడం ఏమిటో?