నందమూరి బాలకృష్ణ అప్ కమింగ్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ముందుగా వినిపించినట్లే రూలర్ టైటిల్ ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన బాలయ్య స్టిల్ మాత్రం బాగా లేదనే చెప్పాలి. ఎన్నికల టైమ్ లో, ఆ తరువాత బాలయ్యను చూసిన వారంతా మళ్లీ సినిమాలకు ఆయన ఫిట్ అవుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అయితే రూలర్ సినిమా స్టార్ట్ అయ్యాక, సూట్ లో బాలయ్య వున్న స్టిల్స్ వదిలారు. అవిచూసి అందరూ, సూపర్ అనుకున్నారు. బాలయ్య మేకోవర్ అదిరింది అనుకున్నారు. కానీ తీరాచేసి టైటిల్ తో పాటు వదిలిన పోలీస్ డ్రెస్ లుక్ లో మాత్రం బాలయ్య చాలా అంటే చాలా నీరసంగా కనిపిస్తున్నారు.
పోలీస్ లుక్ లో గడ్డంతో బాలయ్య లుక్ ఏమాత్రం ఆయన రేంజ్ కు తగినట్లుగా మాత్రం లేదనే చెప్పాలి. ఏ గెటప్ లో అయినా సింహంలా కనిపించే బాలయ్య ఈ పోలీస్ గెటప్ లో అటు జోష్ లేక, ఇటు ఫోర్స్ లేక నీరసంగా వున్నారు. అలాంటి స్టిల్ ఎందుకు వదిలారో యూనిట్ కే తెలియాలి.