తిరుమలో జర్నలిస్టుల దళారీ దందా.. కోట్లలో సంపాదన!

తిరుమలలో ప్రముఖ మీడియా సంస్థల జర్నలిస్టులు సాగించిన దందాల గురించి ఒక వాట్సాప్ మెసేజ్ వైరల్ గా మారింది. సదరు జర్నలిస్టుల పేర్లు, వారు పని చేస్తున్న మీడియా సంస్థల పేర్లతో సహా పేర్కొంటూ..…

తిరుమలలో ప్రముఖ మీడియా సంస్థల జర్నలిస్టులు సాగించిన దందాల గురించి ఒక వాట్సాప్ మెసేజ్ వైరల్ గా మారింది. సదరు జర్నలిస్టుల పేర్లు, వారు పని చేస్తున్న మీడియా సంస్థల పేర్లతో సహా పేర్కొంటూ.. ఆ దళారీ దందా గురించి ఆ మెసేజ్ లో పేర్కొన్నారు. ఈనాడు, టీవీ నైన్, సీవీఆర్ వంటి వార్తా సంస్థలకు జర్నలిస్టుగా పని చేస్తున్న వారు తిరుమలలో దర్శనం టికెట్ల దందాను సాగించినట్టుగా తెలుస్తోంది. వారి గుట్టు కూడా బయటపడినట్టుగా ఆ వైరల్ మెసేజ్  లో పేర్కొన్నారు. సదరు జర్నలిస్టుల తక్కువ కాలంలోనే కొన్ని కోట్లరూపాయలు సంపాదించారని, తిరుమల టికెట్ల దందా అంతటి లాభసాటి వ్యాపారంగా మారిందని ఆ మెసేజ్ లో పేర్కొన్నారు.

ఆ వైరల్ మెసేజ్ పూర్తి పాఠం ఇది…
''1. ఈనాడు వసంత నాయుడిని తిరుమల రిపోర్టింగ్ బాధ్యతల నుంచి ఈనాడు యాజమాన్యం తొలగించింది. 2019 జనవరి నుంచి జూన్ వరకు 820 విఐపి టిక్కెట్లు(కల్యాణం, సుప్రభాతం, ఇతర సేవలు) పొందినట్లు తేలగా.. ఇందులో 80 కూడా ఈనాడు సంస్థకు సంబంధించిన వారు లేరు. వీటి విక్రయం ద్వారా ప్రతిరోజూ ఒక లక్ష రూపాయలు సంపాదించేవాడని తెలిసింది. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా కోటి యాభై లక్షల రూపాయల ఇంటిని కొనుకున్నాడట. ఇతని స్వస్థలం ఐరాల. గత 10 సంవత్సరాలుగా కొండ పైన తిష్ట వేసి పెద్ద దళారిగా మారటంతో ఈనాడు విధుల నుంచి తప్పించింది.

2. CVR న్యూస్ రమణను సైతం ఆ సంస్థ తిరుమల రిపోర్టింగ్ బాధ్యతల నుంచి తప్పించింది. కొండ మీద మూడు తట్టలు, ఆరు అక్రమ దర్శనాల దందా సాగిస్తూ వచ్చిన రమణకు ఉద్వాసన పలికింది. కొండపైన నెలకు 3 నుండి 4 లక్షలు అక్రమ ఆర్జన చేస్తున్నాడని గుర్తించిన సివిఆర్ సంస్థ కొండ దింపింది.

3. టివి 9 నామాల రమేష్ అలియాస్ వేద నారాయణకు ఉద్వాసన పలికేందుకు టివి 9 యాజమాన్యం సిద్ధమవుతోంది.. టెన్త్ కూడా పాసుకాని ఇతను ఏంఎ చదివానని చెప్పి టీవీ 9 హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ కు అడ్డంగా దొరికిపోయాడు. సర్టిఫికెట్ల కోసం 20 రోజులు గడువు కోరి.. కొనసాగుతున్న ఇతను కనీసం టెన్త్ క్లాస్ మార్కు లిస్టు కూడా ఇవ్వలేక పోయాడు. లైవ్, ఫేస్ 2 ఫేస్, పి2సి కాదుకద కనీసం ఫోన్ ఇన్ కూడా చెప్పలేని వేద నారాయణ ఇంతకాలం టివి 9 లో ఎలా కొనసాగగలిగాడని కొత్త యాజమాన్యం ఆరాతీస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.. కనీసం రెండు లైన్లు వార్త రాయడం చేతకాని ఇతను నలుగురు బినామీ రిపోర్టర్లతో కథ నడిపిస్తున్నట్లు తేలింది. 

తిరుమల టీవీ 9 ఆఫీసు దళారుల అడ్డగా మారింది. ఇతని బినామీలు పనిచేస్తున్న ఆరు టీవీ ఛానళ్ళకు ఫీడ్, స్క్రిప్ట్ టీవీ 9 ఆఫీసు నుంచే వెళ్తుంది. టీవీ 9 లెటర్లతో 2019 జనవరి నుంచి జూన్ వరకు 783 విఐపి దర్శనం, సేవా టిక్కెట్లు పొందగా.. ఇందులో టీవీ 9 ఆబ్లిగేషన్ 90 లోపే ఉండగా.. మిగిలినవన్నీ వేద నారాయణ దుర్వినియోగం చేసినట్లు తేలిపోయింది. ప్రతి రోజు గదులు, లడ్డూల దంద మెుత్తం టివి 9 ఆఫీసు నుంచే నడిపిస్తూ.. లక్షలు ఆర్జీంచినట్లు విచారణలో బట్టబయలైంది.. రెండు కార్పొరేట్ సంస్థల పెద్దలకు టివి 9 లెటర్లతో దర్శనాలు చేయిస్తూ ఆ సంస్థలకు అనధికారిక పిఆర్వో గా జీతాలు కూడా తీసుకుంటున్నాడని తెలిసింది. సంస్థను మోసం చేసిన వేద నారాయణను తిరుమల నుంచి సాగనంపడం కాదు.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని టివి 9 యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలిసింది.

4. టిటిడి కూడా మీడియా గద్దలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే మీడియా సిఫార్సు లేఖలపై నిఘా పెట్టిన తిరుమల జేఈవో కార్యాలయం.. ఏ మీడియా సంస్థ తరపున లెటరు పెట్టినా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. నేరుగా మీడియా సంస్థ హెడ్ ఆఫీసులో ఎడిటర్లు, సీఈవోలకు మెసేజ్ పంపుతున్నారు. దీంతో బ్రేక్ దర్శనాల పేరుతో కొందరు జర్నలిస్టులు సాగిస్తున్న అక్రమ వ్యాపారానికి చెక్ పడింది. తినడానికి అలవాడ్డు పడ్డ వీరు చివరకు గదులు, లడ్డులను బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకునే కొత్త దందాకు తెరతీసినట్లు టిటిడి విజిలెన్స్ గుర్తించింది.

తాజాగా పట్టుపడ్డ 13 మంది దళారుల నుంచి స్వాధీనం చేసుకున్న లడ్డూలలో అధిక భాగం మీడియా సిఫార్సు ద్వారా పొందిన లడ్డూలేనని తేలడంతో టిటిడి కంగుతినాల్సి వచ్చింది. ఇకపై గదులు, లడ్డూల దందాకు కూడా బ్రేక్ వేసేందుకు టిటిడి చర్యలు తీసుకోనుంది.'' ఇదీ వాట్సాప్ లో వైరల్ గా మారిన తిరుమల దందా కథ.