హర్యానాలో కుదిరిన డీల్!

హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు  భారతీయ జనతా పార్టీ, జననాయక్  జనతా పార్టీల మధ్యన డీల్ కుదిరింది. ఈ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. వీటిల్లో బీజేపీకి నలభై సీట్లు రాగా,…

హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు  భారతీయ జనతా పార్టీ, జననాయక్  జనతా పార్టీల మధ్యన డీల్ కుదిరింది. ఈ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. వీటిల్లో బీజేపీకి నలభై సీట్లు రాగా, జేజేపీకి పది అసెంబ్లీ సీట్లు వచ్చాయి.

గత ఐదేళ్లుగా హర్యానాను ఏలిన బీజేపీ కనీస మెజారిటీని సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. మెజారిటీకి సీట్లు తక్కువ కావడంతో జేజేపీతో ఒప్పందం చేసుకుంది. అందుకు గానూ ఆ పార్టీకి డిప్యూటీ సీఎం హోదాను ఇస్తోంది. జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తోంది భారతీయ జనతా పార్టీ.

ప్రజలు  తిరస్కరించిన ఖట్టర్ మరోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించబోతూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ సారి అక్కడ బలమైన ప్రతిపక్ష హోదా అయితే దక్కింది. కొంచెం ముందుగా కష్టపడటం ప్రారంభించి ఉంటే  తమకు  అధికారం కూడా దక్కేదని ఆ పార్టీ నేతలు ఇప్పుడు తీరికగా వాపోతూ ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో నిస్పృహకు లోనై కాంగ్రెస్  వాళ్లు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడటానికి కూడా మొహమాట పడ్డారు.