అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు పత్రికలను నిషేదించారు. వైట్ హౌస్ లో ఆ పత్రికలు కనిపించరాదని ఆయన ఆదేశించారు. వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ పత్రికల తీరుపై ఆయన మండిపడుతున్నారు. అవి ఫేక్ వార్తలు రాస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ సంస్థలలో వాటికి చందా నిలిపివేయాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసి తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక సందర్భంలో విలేకరలను ఆయన ప్రజా శత్రువులు అని విమర్శించారట. కాగా 1960వ దశకంలో అప్పటి అద్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి కూడా కొన్ని పత్రికలను ఇలాగే నిషేదించారట. ఇప్పుడు ట్రంప్ కూడా అలాగే చేశారని అంటున్నారు. ట్రంప్ ఆదేశాల మేరకు వైట్ హౌస్ లో ఆ రెండు పత్రికలను నిలిపివేశారు.