నానికి కోపం వ‌చ్చింది…ఎందుకో తెలుసా?

నేచుర‌ల్ స్టార్ నానికి కోపం వ‌చ్చింది. దీంతో ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఘాటుగా ప్ర‌శ్నించారు. అస‌లు నానికి కోపం ఎందు కొచ్చిందో తెలియాలంటే ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే. వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌డం నాని ప్ర‌త్యేక‌త‌.…

నేచుర‌ల్ స్టార్ నానికి కోపం వ‌చ్చింది. దీంతో ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఘాటుగా ప్ర‌శ్నించారు. అస‌లు నానికి కోపం ఎందు కొచ్చిందో తెలియాలంటే ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే. వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌డం నాని ప్ర‌త్యేక‌త‌. అదే నానికి ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌లో స్టార్ రేంజ్ తెచ్చుకున్నారంటే చిన్న విష‌యం కాదు.

ప్ర‌స్తుతం నానికి వ‌రుస‌గా సినిమాలున్నాయి. ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో  ‘వి’,అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో  ‘టక్ జగదీష్’ చిత్రంలో న‌టిస్తున్నారు.  ట‌క్ జ‌గ‌దీష్ చిత్రానికి సంబంధించి  ఇటీవ‌ల  లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ నాని ఫ్యాన్స్‌ని ఫిదా చేసింద‌ని చెప్పొచ్చు.

కాగా ఏ సినిమా చేసినా ఏదో ప్ర‌త్యేక‌త ఉండాల‌ని త‌పించే నాని…ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలో కూడా వెరైటీ పాత్ర చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో  బైపోలార్ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా నాని కనిపిస్తాడని ప్ర‌చారం జ‌రుగుతోంది.  ఈ సమస్య ఉన్నవారు ఏ ఎమోషన్( సంతోషమైనా, బాధ అయినా మ‌రీ ఎక్కువ రియాక్ట్ కావ‌డం) ‌‌కి అయినా విపరీతంగా రియాక్ట్ అవుతారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంలో మ‌తిమ‌రుపు వ్య‌క్తిగా న‌టించి మెప్పించిన‌ నాని… ట‌క్ జ‌గ‌దీష్‌లో బైపోలార్ డిజార్జ‌ర్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతూ వినోదం అందిస్తార‌ని ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. అభిమానులు కూడా న‌మ్ముతున్నారు.

ఈ విష‌యం  నాని దృష్టికి వెళ్లింది. నాని సీరియ‌స్‌గా స్పందిస్తూ… ఎవ‌డు చెప్పాడు అంటూ  ఘాటైన ట్వీట్ చేశారు. నాని ఈ రేంజ్‌లో రియాక్ట్ కావ‌డం ఫ్యాన్స్ కూడా ఎప్పుడూ చూడ‌లేదు. నాని స్పంద‌న‌పై ప్ర‌తి ఒక్క‌రూ షాక్ అయ్యారు. ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం మంచి ఎమోష‌న్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుంద‌ని ఆయ‌న‌ చెప్పుకొచ్చారు. ఇంత‌కూ నాని కావాల‌నే దాస్తున్నారా లేక మ‌రేదైనా కార‌ణ‌మా అనేది సినిమా విడుద‌లైతే త‌ప్ప తెలిసే అవ‌కాశం లేదు.

బాబుగారి గాలి తీసేసిన యువరాణి

టిడిపిని ద్వంసం చేసి, ఆ పునాదులపై ఎదగాలని