టైటిళ్లు.. లుక్ లు.. టీజర్ లు

దీపావళి పండుగ వచ్చేసింది. దానికి ఒకరోజు ముందుగా బోలెడు సినిమాల నుంచి ఏదో ఒక విశేషం బయటకు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండగ అంటే ప్రతి సినిమాకూ ఏదో ఒక స్పెషల్ బయటకు వదలడం…

దీపావళి పండుగ వచ్చేసింది. దానికి ఒకరోజు ముందుగా బోలెడు సినిమాల నుంచి ఏదో ఒక విశేషం బయటకు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండగ అంటే ప్రతి సినిమాకూ ఏదో ఒక స్పెషల్ బయటకు వదలడం అన్నది కామన్ అయింది ఈ మధ్య.

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారవుతున్న అల వైకుంఠపురములో సినిమా నుంచి రాములో.. రాములు ఫుల్ సాంగ్ బయటకు వస్తోంది.

మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి శనివారం ఉదయం విజయశాంతి స్టిల్, సాయంత్రం మహేష్ బాబు స్టిల్ విడుదల చేయబోతున్నారు.

నాగశౌర్య నటిస్తున్న హోమ్ ప్రొడక్షన్ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా రేపే. అశ్వధ్దామ అన్న టైటిల్ అఫీషియల్ గా ప్రకటిస్తారు.

బాలయ్య-కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సి కళ్యాణ్ నిర్మించే సినిమా టైటిల్ కూడా రేపే ప్రకటిస్తారు. రూలర్, డిపార్ట్ మెంట్, జడ్జిమెంట్ అనే మూడు టైటిళ్లు పరిశీలిస్తున్నట్లు బోగట్టా. జడ్జిమెంట్ అనే టైటిల్ కు చాన్స్ వున్నట్లు వినికిడి.

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ ధేవ్ నటించే సినిమా ఒకటి వుంది. ఆగిపోయి మళ్లీ స్టార్ట్ అవుతోంది. పులివాసు డైరక్షన్ లోని ఈ సినిమా టైటిల్ కూడా రేపే ప్రకటిస్తారు. సూపర్ మచ్చి అనే టైటిల్ వుంటుందని తెలుస్తోంది.

సాయిధరమ్ తేజ్-మారుతి కాంబినేషన్ లోని ప్రతిరోజూ పండగే సినిమా మోషన్ పోస్టర్ విడుదల కూడా రేపే. సినిమాలోని స్టార్ కాస్ట్ అంతా దాదాపు ఒకే ఫ్రేమ్ లో వుండేలాంటి మోషన్ పోస్టర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ నిర్మించే భీష్మ సినిమాకు సంబంధించి చిన్న టీజర్ లాంటి వీడియో బైట్ కూడా విడుదల కానుంది. అయితే ఇది శనివారం లేదా ఆదివారం రావచ్చు. ఈ టీజర్ కొద్దిగా రొమాంటిక్ టచ్ తో వుంటుందని తెలుస్తోంది.

ఇవికాక ఇంకా మరి కొన్ని సినిమాలు కూడా లుక్ లు, అనౌన్స్ మెంట్లతో దీపావళికి రెడీ అవుతున్నాయి.

మెగా హీరోపై డైరెక్టర్ ఫన్నీ కామెంట్స్.. సరదా ఇంటర్వ్యూ