కాపులకు రిజర్వేషన్లు ఇవ్వండి చాలు

కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి వారి మదిలో ఎన్టీఆర్..వైఎస్సార్ ల మాదిరిగా జగన్ కూడా నిలిచిపోవాలని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ ను ముఖ్యమంత్రికి రాసారు.  Advertisement విశాఖలో…

కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి వారి మదిలో ఎన్టీఆర్..వైఎస్సార్ ల మాదిరిగా జగన్ కూడా నిలిచిపోవాలని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ ను ముఖ్యమంత్రికి రాసారు. 

విశాఖలో కాపునాడు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ముద్రగడ ఈ లేఖ రాయడం విశేషం. ఈ మధ్య కేంద్రం ఇచ్చిన క్లారిటీ ప్రకారం అయిదు శాతం ఓబిసి రిజర్వేషన్ ను కాపులకు అమలు చేయాలని ముద్రగడ కోరారు. నిజానికి ఇవి ఓబిసి అందరికీ చెందిన రిజుర్వేషన్ శాతం. దాన్ని బాబు కేవలం ఒక్క కాపులకే అమలు చేసారు. జగన్ దాన్ని నిలిపివేసారు.

ఇప్పుడు ముద్రగడ దానినే పునరుద్దరించమని కోరుతున్నారు. 2019 ఎన్నికల్లో కాపులు అంతా వైకాపాకు ఓటేసారని ముద్రగడ గుర్తు చేసారు. మొత్తానికి ముద్రగడ కాపు రిజర్వేషన్ల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోమని సున్నితంగా విజ్ఙప్తి చేసారు. ఈ లేఖ..ఈ విజ్ఙప్తి చూస్తుంటే తన అనుభవంతో ముద్రగడ మెల్లగా బామాలి..బతిమాలి కాపుల రిజర్వేషన్ సాధించాలి తప్ప పోరాట బాట కాదు అనే ధొరణితో వున్నట్లు వుంది. పైగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రస్తావనలు లేఖలో లేవు. కాపునాడు సభ ఊసే లేదు.

అంటే రిజర్వేషన్లు కల్పిస్తే వారి కన్నా జగన్ దే కాపుల్లో పై చేయి అవుతుంది అనే ఐడియాను ముద్రగడ పరోక్షంగా ఇస్తున్నట్లు వుంది తప్ప వేరు కాదు. కానీ కాపుల రిజర్వేషన్ అన్నది రాష్ట్రానికి సాధ్యం కాదు అని గత ఎన్నికల టైమ్ లోనే జగన్ క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు మాత్రం కొత్తగా ఏం చేస్తారు? పైగా రద్దు చేసినవి పునరుద్దరిస్తే క్రెడిట్ బాబుకు పోతుంది. అందువల్ల ఈ లేఖ వల్ల పెద్దగా ప్రయోజనం అయితే వుండకపోవచ్చు.