రైమింగ్ తో మాటల తూటాలు పంచ్ డైలాగులు ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్. తాను అవుట్ డేటెడ్ కాదని చంద్రబాబు నిరూపించుకోవడానికి క్యాచీ డైలాగులను పట్టుకుని మీటింగులు పెడుతున్నారు. వ్యూహకర్తలు తెర వెనక మంచి రైమింగ్ డైలాగులను రెడీ చేసి పెట్టినవి కూడా వల్లిస్తున్నారు.
అయితే ఫ్లోలో బాబు టంగ్ కొన్ని సార్లు స్లిప్ అవుతోంది. దాంతో మ్యాటర్ మొత్తం మారిపోయి టోటల్ డ్యామేజ్ అవుతోంది. ఉత్తరాంధ్రా టూర్ లో జనాలను చూసి తనకు కళ్ళు తిరుగుతున్నాయని అంటున్న బాబు నాలిక సైతం మడతేస్తున్నారు అని వైసీపీ వారు ర్యాంగింగ్ చేస్తున్నారంటే బాబు అడ్డంగా దొరికిపోయినట్లే కదా.
ఆయన రాజాం, బొబ్బిలి, విజయనగరం రోడ్ షోలలో మాట్లాడుతూ చివరలో సైకో పాలన పోవాలని, సైకిల్ పాలన రావాలని జనాలకు చెప్పి మరీ నినాదాలు చేయిస్తున్నారు. అయితే సైకో పాలన అనడానికి బదులుగా బాబు చాలా చోట్ల సైకిల్ పాలన పోవాలంటూ చెప్పడంతో అంతా షాక్ తిన్నారు.
ఇలా బాబు అతి ఉత్సహాంతో పొరపాటున చేశారా లేక అలా టంగ్ స్లిప్ అయి జరిగిందా అన్నది తెలియదు కానీ పాపం బాబు తన కోసం జనాలు వస్తే సైకిల్ పాలన పోవాలని అని తానే చెప్పేసుకున్నారు అంటున్నారు. దీన్ని జాగ్రత్తగా పట్టుకున్న వైసీపీ నేతలు బాబును ఒక ఆట ఆడుకుంటునారు.
అవును బాబు చెప్పినది అక్షరాలా నిజం. సైకిల్ పాలన పోవాలని ఆయనే చెప్పారు. అది 2019లో జరిగింది. మరోసారి జరిగి తీరుతుంది. ఎందుకంటే బాబు చెప్పేవి ఇపుడు అన్నీ నిజాలే కాబట్టి అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అయితే బాబు తన పాలన మళ్లీ వద్దు అని విజయనగరం జిల్లా టూర్ లో చెప్పి మరీ వెళ్లారని, దాంతో జనాలకు కూడా పూర్తి క్లారిటీ వచ్చిందని సెటైర్లు వేశారు.
వైసీపీకి కంచుకోటలా విజయనగరం ఉందని, అక్కడ తమ పార్టీని ఏదో చేయాలని చూసే ముందు కుప్పంలో తాను తెలుస్తానో లేదో బాబు చెక్ చేసుకోవడం మంచిదని కోలగట్ల తనదైన పంచ్ డైలాగ్ పేల్చేశారు. పాపం చంద్రబాబుకు జనాలు వచ్చారు. తోలుకొచ్చిన జనాలు అని వైసీపీ అంటోంది. అలా వచ్చిన జనాలకు కూడా సైకిల్ కి ఓటేయండి అనకుండా సైకిల్ పాలన పోవాలని బాబు అనడమే అశుభంగా ఉందని తమ్ముళ్ళు బుర్రలు గోక్కుంటున్నారు.