బాలీవుడ్ మీడియాకు ఇప్పుడు జాన్వీ కపూర్ ఒక హాట్ టాపిక్. ఆమె ఎదురైతే చాలు.. కెమెరాలు క్లిక్ మంటాయి, ఆమె ఫొటోలు కనిపిస్తే చాలు వర్ణనలు మొదలవుతాయి. జాన్వీ కపూర్ వెబ్ లో మీడియాకు బాగా ఇంట్రస్టింగ్ పర్సన్ గా కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆమె లుక్స్ మీడియాలో వైరల్ గా మారాయి.
జాన్వీ వచ్చే చోటు గురించి తెలుసుకుని, ముందే కెమెరాలు అక్కడ క్లిక్ మంటూ ఉంటాయి. ఆమె జిమ్ కు వచ్చి వెళ్లేటప్పుడు, ఏవైనా పార్టీలకు అటెండ్ అయినప్పుడు కెమెరా మెన్లు కొందరు డ్యూటీలోనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తూ జాన్వీ కపూర్ ఇలా అగుపించింది.
స్పోర్ట్స్ వేర్ లో జాన్వీ ఎక్స్ ప్రెషన్స్ క్యూట్ గా ఉన్నాయి. ఇక ఆమె భుజానికి వేసుకున్న బ్యాగ్ పై కూడా ఫ్యాషన్ ఆసక్తిపరులకు చూపుపడింది. పనిలో పనిగా ఆ బ్యాగ్ ధర ఎంతో కూడా చెబుతున్నాయి. వారు చెప్పేదాని ప్రకారం.. ఆ బ్యాగ్ ధర నాలుగు లక్షల రూపాయలు!