ఢిల్లీలో బాస్‌డీకే…ఏపీలో బోస్‌డీకే!

రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి ఏద‌న‌డిగితే టీడీపీ అనే స‌మాధానం వ‌స్తుంది. అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలో టీడీపీ మారుపేరైంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు మూడున్న‌రేళ్ల పాటు ఎన్‌డీఏ ప్ర‌భుత్వంలో టీడీపీ భాగ‌స్వామిగా ఉండింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు…

రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి ఏద‌న‌డిగితే టీడీపీ అనే స‌మాధానం వ‌స్తుంది. అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలో టీడీపీ మారుపేరైంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు మూడున్న‌రేళ్ల పాటు ఎన్‌డీఏ ప్ర‌భుత్వంలో టీడీపీ భాగ‌స్వామిగా ఉండింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు విభ‌జ‌న హామీలను మోడీ స‌ర్కార్ నెర‌వేర్చ‌క‌పోయినా నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నోరెత్తిన పాపాన‌పోలేదు. 

పైగా ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి ఏమొస్తుంద‌ని అసెంబ్లీ వేదిక‌గా ఇదే చంద్ర‌బాబునాయుడు ప్ర‌తిప‌క్షాన్ని ద‌బాయించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయ‌క‌పోయినా… మోడీ ఎంతో చేశార‌ని, ఇంత‌కంటే ఎవ‌రైనా ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించిన తెంప‌రిత‌నం చంద్ర‌బాబు సొంతం.

అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డం, అలాగే నిధుల మంజూరులో మోడీ స‌ర్కార్ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తోంద‌నే వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని చంద్ర‌బాబు గ్ర‌హించి బీజేపీకి దూర‌మ‌య్యారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తోన్న‌ బీజేపీకి జ‌గ‌న్ అనుకూల‌మ‌నే ముద్ర‌వేసి రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చంద్ర‌బాబు ప‌న్నాగం ప‌న్నారు. మోడీకి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా ర‌క‌ర‌కాల దీక్ష‌లు చేప‌ట్టారు. చివ‌రికి తాను తీసుకున్న గోతిలో తానే ప‌డ్డారు. కేంద్రంలో మోడీ మ‌ళ్లీ అధికారంలోకి రాగా, ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ మ‌ట్టికొట్టుకుపోయింది.

మోడీతో పెట్టుకుని అధికారానికి దూర‌మ‌య్యాయ‌ని గ్ర‌హించి, మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు బాబు చేయ‌ని ప్ర‌యత్నం లేదు. మోడీ, అమిత్‌షాల ప్ర‌స‌న్నం కోసం చంద్ర‌బాబు త‌ప‌స్సు చేస్తున్నారు. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా మోడీ, అమిత్‌షాల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. మోడీ, అమిత్‌షాల‌కు వ్య‌తిరేకంగా నోరు తెరిచే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబు స‌హా ఏ ఒక్క టీడీపీ నేత‌కూ లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇందుకు గ‌ల కార‌ణాలు కూడా అంద‌రికీ తెలిసిన‌వే.

ఈ నేప‌థ్యంలో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి సీఎం జ‌గ‌న్‌పై బూతు పురాణం రాజ‌కీయ దుమారం రేపింది. ఈ నేప‌థ్యంలో ప‌ట్టాబిని వెన‌కేసుకొచ్చేందుకు బోస్‌డీకే అనే ప‌దానికి టీడీపీ నేత‌లు అస‌లై్ంది త‌ప్ప ఇత‌ర‌త్రా త‌ప్పుడు అర్థాల‌ను తెర‌పైకి తెచ్చి అభాసుపాల‌వుతున్నారు. ఈ ప‌రంప‌ర‌లో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఘాటైన పంచ్ విసిరారు. టీడీపీ నేత‌ల‌కు స‌జ్జ‌ల విసిరిన స‌వాల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స‌జ్జ‌ల విసిరిన స‌వాల్ ఏంటంటే…

“ఏపీ ముఖ్య‌మంత్రిని మీరు తిట్టించిన ప‌దం బూతు కాక‌పోతే …దానికి అర్థం బాగున్నారా అనే అయితే , రేపు ఢిల్లీ వెళ్లిన‌పుడు కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షాను అదే ప‌దంతో సంబోధించి , మీ చొక్కా న‌ల‌గ‌కుండా బ‌య‌టికి రాగ‌ల‌రా? చొక్కా న‌ల‌గ‌కుండా బ‌య‌టికొస్తే …ఆ ప‌దాన్ని మేమే త‌ప్పుగా అర్థం చేసుకున్నామ‌ని క్ష‌మాప‌ణ చెబుతాం. లేక‌పోతే అది బూతేన‌ని , త‌ప్పు చేశామ‌ని సీఎంకు క్ష‌మాప‌ణ చెప్పాలి. అందుకు సిద్ధ‌మా” అని స‌జ్జ‌ల డిమాండ్ చేశారు.

టీడీపీ నేత‌లు ఢిల్లీకి వెళితే అధికార పార్టీ నేత‌లంతా “బాస్‌”డీకేల్లా క‌నిపిస్తార‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. ఎందుకంటే నోరు పారేసుకుంటే బొక్క‌లో తోసేయిస్తార‌ని చంద్ర‌బాబుకు భ‌య‌మ‌ని అంటున్నారు. ఇదే  ఏపీకి వ‌స్తే మాత్రం అక్క‌డి అధికార పార్టీ నేత‌లంతా బోస్‌డీకేల్లా క‌నిపిస్తార‌ని వెట‌క‌రిస్తున్నారు. టీడీపీ నేత‌ల‌కు అధికారంలో ఉన్న బీజేపీ నేత‌లంటే భ‌య‌మే త‌ప్ప‌, గౌర‌వం కాద‌ని ఈ సంద‌ర్భంగా గ‌తంలో మోడీ, అమిత్‌షాల‌పై నోరు పారేసుకున్న ఉదంతాల‌ను గుర్తు చేస్తున్నారు. 

మోడీ భార్య‌పై చంద్ర‌బాబు కామెంట్ చేయ‌డాన్ని ఉద‌హ‌రిస్తున్నారు. అలాగే అమిత్‌షాపై తిరుప‌తిలో దాడిని తెర‌పైకి తేవ‌డం గ‌మ‌నార్హం. ఇద‌న్న మాట టీడీపీ నీతి, రీతి.