ప్రభాస్ కు సంబంధించి ఈ సీక్రెట్స్ మీకు తెలుసా?

ఎక్కువగా తన సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాల్ని మీడియాతో పంచుకోడు ప్రభాస్. చాలా తక్కువగా మీడియా ముందుకొచ్చే ఈ నటుడు, అతి తక్కువగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల్ని బయటపెట్టాడు. అలా…

ఎక్కువగా తన సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాల్ని మీడియాతో పంచుకోడు ప్రభాస్. చాలా తక్కువగా మీడియా ముందుకొచ్చే ఈ నటుడు, అతి తక్కువగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల్ని బయటపెట్టాడు. అలా ప్రభాస్ కు సంబంధించి ఎక్కువగా ఎలివేట్ అవ్వని కొన్ని విషయాల్ని ఇక్కడ తెలుసుకుందాం.

ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ఈ హీరో తొలి హిందీ సినిమా బాహుబలి అని చాలామంది అనుకుంటారు. కానీ బాహుబలి కంటే ముందు బాలీవుడ్ లో యాక్షన్ జాక్సన్ అనే సినిమాలో నటించాడు ప్రభాస్. కాకపోతే అది గెస్ట్ రోల్ మాత్రమే.

ప్రభాస్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే, ఇతడు హీరో అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. స్వతహాగా భోజనప్రియుడైన ఈ హీరో, మంచి హోటల్స్ పెడదాం అనుకున్నాడు. హోటల్ బిజినెస్ నే కెరీర్ గా మలుచుకుందామనుకున్నాడు. కానీ అనుకోకుండా హీరోగా మారాడు. అదే అతని కెరీర్ అయింది. 

ప్రభాస్ కు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చికెన్, మటన్, రొయ్యలు అనే తేడాలేకుండా అన్ని రకాల బిర్యానీలు లాగించేస్తాడు. బాహుబలి షూటింగ్ టైమ్ లో ఛీట్ మీల్ సందర్భంగా ఏకంగా 15 రకాల బిర్యానీలు తెప్పించుకొని మరీ తిన్నాడు ఈ హీరో.

ప్రభాస్ ఫిజిక్ వెనక ఉన్న వ్యక్తి లక్ష్మణ్ రెడ్డి. ప్రభాస్ ట్రయినర్ ఇతడే. 2010లో లాస్ వెగాస్ లో జరిగిన మిస్టర్ వరల్డ్ పోటీల్లో విజేత ఇతడు. రీసెంట్ గా ఇతడికి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు ప్రభాస్. ప్రభాస్ తనకు ఇష్టమైన వ్యక్తులందర్నీ డార్లింగ్ అని పిలుస్తాడు. లక్ష్మణ్ ను కూడా అలానే పిలుస్తాడు.

హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత రాబర్ట్ డెనిరో అంటే ప్రభాస్ కు ఇష్టం. ఇక బాలీవుడ్ కు సంబంధించి రాజ్ కుమార్ హిరాణీ సినిమాలు ఇష్టం. ఇక తన ఇంటికి ఎవరొచ్చినా కడుపునిండా భోజనం పెట్టి పంపించడం ఇంకా ఇష్టం. ప్రభాస్ తో నటించిన హీరోయిన్లంతా అతడి ఆత్మీయత, ఆతిథ్యానికి ఫిదా అవుతారు. రకరకాల వంటకాల్ని ప్రత్యేకంగా తయారుచేయించి హీరోయిన్లకు స్వయంగా తనే వడ్డిస్తుంటాడు ప్రభాస్.

ఇక ఫైనల్ గా చెప్పాలంటే, ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే గిట్టని వ్యక్తి ఉండరు. అందరికీ డార్లింగ్ ప్రభాస్. అదే అతడి ఆకర్షణ.