చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగుల్లో ఏదేదో చెప్పుకుపోతున్నారు. ఆయన తీరును ఎంతమంది పట్టించుకున్నారో కానీ, పట్టించుకుంటున్న వాళ్లు మాత్రం ఏంటి ఈయన మరీ ఇలా.. అని అనుకుంటున్నారు. అబద్ధాలు, గాలి మాటలు.. తప్ప చంద్రబాబు నాయుడి మీటింగుల్లో మరో ఊసే ఉండటం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీరును సోషల్ మీడియాలో ఉతికారేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు తను చేసినవిగా చంద్రబాబు నాయుడు చెప్పుకున్న విషయాలను అదే జిల్లా వాసి ఒకరు తూర్పారబట్టారు. అందులోని నిజానిజాలను వివరించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప మరేం చెప్పడం లేదు, ఆ అబద్ధాలను కూడా మరీ నిస్సిగ్గుగా ఆయన చెప్పుకుంటున్నారని అనిపిస్తే.. అందులో తప్పు వాస్తవాలది కాదు, నిస్సందేహంగా చంద్రబాబుదే!
'' జూమ్ యాప్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చిన ప్రాజెక్టుల స్టేటస్ ఏంటా అని ఒకసారి చూస్తే..
హార్టీకల్చరల్ యునివర్సిటీ తీసుకొచ్చా..
– ఆసలు ఇంకా స్థలం కుడా చూడలేదు.. బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయింపు కూడా జరగలేదు.
మైన్స్ యునివర్సిటీ తీసుకొచ్చా..
– జష్ట్ ప్రపోజల్ స్టేజ్ కుడా దాటలేదు.. బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయింపు కూడా జరగలేదు.
IIIT తీసుకొచ్చా..
– ఇంకా శంకుస్థాపన భుమిపూజ కూడా జరగలేదు
24 వేల కోట్లతో ఏషియన్ పేపర్ మిల్ తీసుకొచ్చా..
ఇదీ మరీ ఘోరం..- ఆయన పేపర్ మీద తీసుకొచ్చిన 16 లక్షల కోట్ల పెట్టుబడిలో ఇదొకటి.. వాస్తవానికి ఆ కంపెనీ ప్రతినిధులు ఎవరో 2019 ఎన్నికలకు కొద్ది రోజులు ముందు మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉన్నామని అప్పట్లొ ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలసినట్టు పేపర్లో వార్త తప్ప.. వాళ్ళు వచ్చింది లేదు.. రాష్ట్ర ప్రభుత్వంతో MOU కుదుర్చుకుంది లేదు.. ఒక ఎకరం పొలం కొన్నదీ లేదు..
రామయపట్నం తీసుకొచ్చా..
– అది కేంద్ర పరిధిలో ఉంది. అయినా దానికోసం చంద్రబాబు గారు ఒక్క రూపాయి కుడా కేటాయించింది లేదు.. ఒక్క ఎకరం కూడా సేకరించిందీ లేదు. 2014 ఎన్నికల ముందు రామాయపట్నం పోర్ట్ నిర్మిస్తామని ఏదైతే చెప్పాడో.. అదే వాగ్ధానం 2019 ఎన్నికల ముందు అదే వాగ్ధానాన్ని ఒక పదం కుడా మార్చకుండా copy paste చేశాడు..
గుళ్ళకమ్మ డ్యాం నేనే తెచ్చా..
– ఆ ప్రాజెక్ట్ 2005 లో రాజశేఖర రెడ్డి హాయంలో మొదలుపెట్టి.. రికార్డు సమయంలో కేవలం 3 ఏళ్ల సమయంలో పూర్తి చేసి.. 2008 లో రాజశేఖర రెడ్డి గారే ప్రారంభించారు. మిగాతా ముఖ్యమంత్రుల హయంలో కట్టించిన ప్రాజెక్టులను కూడా నిసిగ్గుగా తన ఖాతాలోనే వేసుకున్న ఘనత ఆయనకే చెల్లుతుంది..
ఇకపొతే ఆయన హయంలో గుళ్ళకమ్మ నుండి ఒంగోలు నగరానికి త్రాగునీటి పధకం పైప్ లైన్ కు కొంత నిధులు కేటాయించారు అంతే..
వెలుగొండ ప్రాజెక్ట్ నేనే మొదలు పెట్టా..
దీని గురించి ఆయన ఎంత తక్కువ చెప్పుకుంటే అంత పరువు మిగులుద్ది. ఇంతకీ ఆయన చేసిన పని ఎందంటే ప్రాజెక్ట్ శంకుస్థాపన చేస్తున్నట్టు 1996 లో రాయి ఒకటి వేశాడు.. అప్పటినుంచి 2004 వరకు ప్రాజెక్ట్ కు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసింది లేదు. 2004 లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక మొట్ట మొదటిసారి పుష్కలంగా నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. రిజర్వాయర్ నిర్మాణాన్ని కుడా పూర్తి చేశారు.
మొత్తం 18 కిమీ పొడవు ఉన్న రెండు సొరంగాలలో గత చంద్రబాబు హయంలో 2014 నుండి 2019 వరకు తవ్వింది కేవలం ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే అంటే మీరు నమ్మగలరా?? ఆఖరికి ఒక్కసారి 500 కోట్లు ఖర్చుపెట్టి ఇంకొక్క 2 కిమీ సొరంగం కొడితే మొదటి సొరంగం పని అయిపోతుందని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎంత బతిమాలినా ఆయన మనసు కనికరించలేదు..
అన్నింటికన్నా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల ముందు జిల్లా ప్రజలకు ఏ వాగ్దానాలు చేశారో.. అవే హామీలను కామా పులుస్టాపులు తో సహా ఒక్క అక్షరం ముక్క కుడా పొల్లు పోకుండా 2019 ఎన్నికల్లో కూడా అవే హామీలు ఇవ్వడం ఆయనకే చెల్లింది.. బహుశా ఆయన్ని విజనరీ అన్నది అందుకేనోమో!!
మరి మా జిల్లా సంగతే ఇలా ఏడిస్తే.. ఇంక ఆ జూమ్ యాప్ లో మిగాతా జిల్లాల పరిస్తితి ఎంటో అర్ధం చేసుకోవచ్చు!!
ఇంత జరిగాక కూడా ఇప్పుడు కుడా వరుస జూమ్ మీటింగ్ లలో అంతా నేనే చేశా.. రాయలసీమ ప్రాజెక్టులన్ని నేనే తెచ్చాను అంటారు. ఒక్క పిల్లర్ కూడా వెయ్యకుండానే విశాఖ మెట్రో నేనే తెచ్చా అంటాడు.. విజయవాడ మెట్రో నేనే తెచ్చా అంటాడు.. నేల మీద ఒక్క కిలోమీటర్ కుడా పనులు మొదలుకాని అనంతపురం-అమరావతి 8 వరుసల రహదారి నేనే తీసుకొచ్చా అంటాడు.. విజన్ 2030 నేనే తెచ్చా అంటాడు.. ఇవన్నీ 2019 ఎన్నికల్లో ఊరూర తిరిగి చెప్పినవే కాదా?? ఇందులో కొత్తగా ఏవైనా ఉన్నాయా ??
ఇక రోజు మార్చి రోజు ఆయన పెట్టే జూమ్ మీటింగులను తన సొంత భజన మీడియా తో సహా మాములు జనం కూడా ఎలాగూ పట్టించుకోవడమే మానేశారు. ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలు సైతం ఆ ఊక దంపుడు ప్రసంగాలు దెబ్బకి మాకొద్దు బాబోయి ఈ శిక్ష అంటూ చెట్టుకు ఒకరు.. పుట్టకు ఒకరు పారిపొతున్నా.. ఆ విషయం అర్ధం చెసుకొని ఆయన మారతారని ఆశ పడితే.. అది మీ భ్రమే!!''
-శ్రీధర్ రెడ్డి చల్లా