భ‌ళ్లాల దేవుడి త‌మ్ముడి కారుకు ప్ర‌మాదం

బాహుబ‌లిలో భ‌ళ్లాలి దేవుడి పాత్ర‌లో  టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో రానా మెప్పించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే తాను ప్రేమించిన మిహీకాను పెళ్లాడి ఓ ఇంటి వాడు కూడా అయ్యాడు. రానా త‌మ్ముడు, ప్ర‌ముఖ నిర్మాత…

బాహుబ‌లిలో భ‌ళ్లాలి దేవుడి పాత్ర‌లో  టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో రానా మెప్పించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే తాను ప్రేమించిన మిహీకాను పెళ్లాడి ఓ ఇంటి వాడు కూడా అయ్యాడు. రానా త‌మ్ముడు, ప్ర‌ముఖ నిర్మాత కుమారుడైన ద‌గ్గుబాటి అభిరామ్ కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ విష‌యంలో అభిరామ్‌తో పాటు మ‌రో కారు కూడా రాంగ్‌రూట్‌లో వెళ్ల‌డం వ‌ల్లే ప్ర‌మాదానికి గురైన‌ట్టు పోలీసులు గుర్తించారు.

ద‌గ్గుబాటి అభిరామ్ కొత్త కారు కొనుక్కోవాల‌ని నిర్ణ‌యించాడు. దీంతో కార్ల గురించి బాగా తెలిసిన వ్య‌క్తి క‌రీంన‌గ‌ర్ జిల్లా ఆరేప‌ల్లికి చెందిన రాజు మెకానిక్ ల‌క్ష్మ‌ణ్‌ను వెంట‌బెట్టుకుని హైద‌రాబాద్‌కు వెళ్లాడు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మ‌ణికొండ‌లో సంబంధిత య‌జ‌మాని నుంచి కారు తీసుకుని టెస్ట్ డ్రైవ్ కోసం క‌లిసి వెళ్లాడు.

పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్‌ హౌస్‌ పక్కరోడ్డు నుంచి  అభిరామ్‌ కారులో రాగా పరస్పరం రెండు కార్లు ఢీకొన్నాయి. త‌మ కారుకు డ్యామేజీ జ‌ర‌గ‌డంతో  రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో అభిరాం, రాజు  ఫిర్యాదు చేశారు. పోలీసులు త‌మ విధుల్లో భాగంగా ముందుగా ఇద్దరికీ బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించారు. ఈ ప‌రీక్ష‌లో మద్యం తాగలేదని తేలింది. అయితే ప్ర‌మాదానికి గురైన రెండు కార్లు కూడా రాంగ్‌ రూట్‌లో వచ్చాయ‌ని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోయిన ప‌ని ఒక‌టైతే, అక్క‌డ జ‌రిగింది మ‌రొక‌టి. ద‌గ్గుబాటి అభిరాం సినిమాల్లో కంటే ఇలాంటి వాటిల్లోనే అప్పుడ‌ప్పుడూ పేరు వినిపిస్తూ ఉంటుంది.

వైఎస్సార్ చేయూత