ఆ సినిమాకు ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదు

విక్టరీ వెంకటేష్ తో సినిమా సెట్ కావడం, స్టార్ట్ కావడం అంటే అంత వీజీ కాదు. సెవెన్ స్టేజ్ ఫిల్టరైజేషన్ అన్నట్లుగా బోలెడు పరీక్షలు పాసవ్వాలి. అప్పుడు కానీ స్క్రిప్ట్ ఓకె కాదు. అందుకే…

విక్టరీ వెంకటేష్ తో సినిమా సెట్ కావడం, స్టార్ట్ కావడం అంటే అంత వీజీ కాదు. సెవెన్ స్టేజ్ ఫిల్టరైజేషన్ అన్నట్లుగా బోలెడు పరీక్షలు పాసవ్వాలి. అప్పుడు కానీ స్క్రిప్ట్ ఓకె కాదు. అందుకే చాలామంది పేర్లు వినిపిస్తుంటాయి కానీ సినిమా ఎప్పటికీ అంత సులువుగా ఫైనల్ కాదు. సీత సినిమా సబ్జెక్ట్ పట్టుకుని దర్శకుడు తేజ ఏడాదికి పైగా సురేష్ కాంపౌండ్ లో వుండి, ఆఖరికి సినిమా చేయకుండానే బయటకు వచ్చి బెల్లంకొండ హీరోతో చేసుకోవాల్సి వచ్చింది. పక్కా స్క్రిప్ట్ అయితే తప్ప అక్కడ ఆమోదముద్ర పడదు.

పెళ్లిచూపులు తరువాత నుంచి వినిపిస్తోంది దర్శకుడు తరుణ్ భాస్కర్ పేరు. కానీ ఇఫ్పటికి ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు. ఈ మధ్య ఇదిగో సినిమా, అదిగో సినిమా అంటూ వార్తలు వినిపించాయి. కానీ తెలుస్తున్న అసలు విషయం వేరుగా వుంది. తరుణ్-వెంకీ సినిమాకు ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ చర్చలు, మార్పులు చేర్పులు వంటి అవిశ్రాంత కార్యక్రమం అలా సాగుతూనే వుందని బోగట్టా. అది ఫైనల్ అయితే అప్పుడు సినిమా అనౌన్స్ మెంట్.

ఈలోగా మరో డైరక్టర్ నక్కిన త్రినాధరావు తన ప్రయత్నం తాను చేస్తున్నారు. విక్టరీ వెంకీ కోసం తనో స్క్రిప్ట్ తయారుచేస్తున్నారు. అది కనుక ఫుల్ గా క్లియరెన్స్ తెచ్చుకుంటే, అదే ముందుగా తెరకెక్కే అవకాశం ఎక్కే వుంది. ఆ స్క్రిప్ట్ అయినా కూడా సురేష్ బాబు ఆమోదముద్ర వేయించుకోవాలి.

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే