ఆమె నోటికి హద్దూ అదుపూ లేదు. ఎదుటి వాళ్ల స్థాయిని మరిచి ఇష్టానుసారం మాట్లాడుతూ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుం టారామె. చిత్ర పరిశ్రమలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మను ఆడిపోసుకుంటారు గానీ…రాజకీయ పార్టీ ముసుగేసు కున్న ఆవిడ గారి మాటలు వింటే…వర్మే ఎంతో బెటర్ అనకుండా ఉండరు.
తాజాగా ఈ “వంకర స్త్రీ” ప్రధాని మోడీపై నోరు పారేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనేక మార్లు నోటి దురుసు ప్రదర్శించడం, ఎల్లో మీడియా వాటిని హైలెట్ చేయడం తెలిసిందే. సభ్యత, సంస్కారం లేని మాటలెలా ఉంటాయో ఉదహరించేం దుకు ఈమె నోటి నుంచి వెలువడుతూ “పద్మా”ల్లా విచ్చుకునే తిట్లను తీసుకోవచ్చు.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోడీని ఆహ్వానించాలని జగన్ సర్కార్ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకుస్థాపనకు రావడానికి ప్రధాని మోడీకి సిగ్గులేదా అంటూ సదరు నాయకురాలు అవాకులు చెవాకులు పేలారు. మోడీ రాజకీయ పంథాను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ విమర్శ శ్రుతి మించి వ్యక్తిగత దూషణకు దారి తీయడమే అభ్యంతరకరం.
వైజాగ్‌కు ఏ మొహం పెట్టుకుని ఇంకో రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారని ప్రధానిని ఆమె ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీ ఏపీ సీఎం జగన్‌కు ఇంకా అపాయింట్‌మెంటే ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏవేవో ఊహించుకుని ఇష్టమొచ్చిన రీతిలో నోరు పారేసుకోవడం సభ్యతేనా? ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన జాతీయ పార్టీ మహిళా నేత ముసుగులోనూ, రాజధాని పోరాటం పేరుతో స్వయం ప్రకటిత సంఘం నేతగా చెలామణి అవుతూ ఉన్నత స్థానంలో ఉన్న నేతలపై తిట్ట వర్షం కురిపించడం ఎంత మాత్రం సంస్కారమో ఆలోచించాలి.
ఇలాంటి వారి దూషణలకు ప్రాధాన్యం ఇస్తున్న మీడియా సంస్థలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ల తిట్ల దండకాన్ని హైలెట్ చేయడం ద్వారా మరింత ప్రోత్సహించినట్టవుతుంది.