సురేందర్ రెడ్డి @ 12 కోట్లు?

అక్కినేని కుటుంబం నుంచి వచ్చి స్ట్రగుల్ అవుతున్న హీరో అఖిల్. తొలి సినిమా భారం స్నేహితుడు నితిన్ మోసాడు. నష్టం భరించాడు. మరో సినిమా నష్టం తండ్రి నాగ్ భరించాడు. మరో సినిమాకు అంతగా…

అక్కినేని కుటుంబం నుంచి వచ్చి స్ట్రగుల్ అవుతున్న హీరో అఖిల్. తొలి సినిమా భారం స్నేహితుడు నితిన్ మోసాడు. నష్టం భరించాడు. మరో సినిమా నష్టం తండ్రి నాగ్ భరించాడు. మరో సినిమాకు అంతగా నష్టం లేకపోయింది కాబట్టి సరిపోయింది. లేటెస్ట్ సినిమాను గీతా 2 సంస్థ నిర్మిస్తోంది. ఆ తరువాత సినిమాకు మాత్రం నిర్మాత కోసం వేట సాగుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాను క్రిష్ ఆయన మిత్రులు కలిసి తమ ఫస్ట్ ఫ్రేమ్ పతాకంపై నిర్మిద్దాం అనుకున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా చేయాలని అనుకోవడమే సమస్య వచ్చింది. ఎందుకంటే సురేందర్ రెడ్డి ఇప్పుడు ఓ రేంజ్ డైరక్టర్ల జాబితాలో వున్నారు. ఆయన 10 కోట్లకు పైనే రెమ్యూనిరేషన్ అడుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. 

సురేందర్ రెడ్డికి 12 కోట్లు ఇచ్చి, హీరో, హీరోయిన్, టెక్నికల్ టీమ్ ఇవన్నీ కలిపి 20 కోట్ల వరకు రెమ్యూనిరేషన్లే అయిపోతాయి. ఇక ఆ పై ప్రొడక్షన్. తీసుకున్న సబ్జెక్ట్ ను బట్టి వుంటుంది. మొత్తం మీద ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లకు పైగానే అని తెలుస్తోంది. దాంతో క్రిష్ సినిమాను సమర్పించడానికి వేరేవాళ్లు ఎవరైనా వస్తే నిర్మాతగా ప్రాజెక్టు అప్పగించడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎవరు వచ్చినా అఖిల్ మీద 40 కోట్ల మార్కెట్ అంటే కాస్త ఆలోచించాల్సి వుంటుంది. ప్రస్తుతం తయారవుతున్న బ్యాచురల్ సినిమా అన్నది బాగా బడ్జెట్ లో తయారవుతోంది. చాలాకాలంగా సినిమా చేయని బొమ్మరిల్లు భాస్కర్ డైరక్టర్ కాబట్టి బడ్జెట్ సమస్య రాలేదు. కానీ సురేందర్ రెడ్డి లాంటి డైరక్టను తీసుకోవాలి అంటే బడ్జెట్ సమస్యే.  ఎందుకో హీరో నాగ్ కొడుకు అఖిల్ కేరీర్ మీద కాస్త గట్టిగా దృష్టి పెట్టడం లేదనిపిస్తోంది ఇండస్ట్రీలో గుసగుసలు వింటుంటే.

ఒకసారి మోసపోయాను ఈ సారి వదలను

ఈ గడ్డంతో నిద్ర పట్టట్లేదు