టెన్షన్ లో కేజిఎఫ్ టీమ్?

కేజిఎఫ్ 2 అనేది అప్ కమింగ్ భారీ సినిమాల్లో ఒకటి. కరోనా కారణంగా ఈ సినిమా షెడ్యూలు అంతా చిందరవందర అయిపోయింది. 2021 సంక్రాంతికి విడుదల సాధ్యమా? కాదా? అన్నది కూడా క్లారిటీ లేదు.…

కేజిఎఫ్ 2 అనేది అప్ కమింగ్ భారీ సినిమాల్లో ఒకటి. కరోనా కారణంగా ఈ సినిమా షెడ్యూలు అంతా చిందరవందర అయిపోయింది. 2021 సంక్రాంతికి విడుదల సాధ్యమా? కాదా? అన్నది కూడా క్లారిటీ లేదు. భారీ పెట్టుబఢి, భారీ అమ్మకాల అంచనాలు వున్నాయి ఈ సినిమాకు. కరోనా కు ముందు కేజిఎఫ్ 2 ను తెలుగులో కొనడానికి పోటీలు పడ్డారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.

ఇప్పుడు లేటెస్ట్ డెవలప్ మెంట్లు మరింత కలవరపెడతున్నాయి. కేజిఎప్ 2 లో కీలకపాత్ర నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అనారోగ్యంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో వుండడంతో, హుటాహుటిన అమెరికాకు తరలిస్తున్నారు. మరి ఆయన వెనక్కు రావడానికి ఎన్నాళ్లు పడుతుందో? ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సెట్ మీదకు రావడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదు.

కేజిఎప్ 2 విషయానికి వస్తే, సంజయ్ దత్ వర్క్ ఇంకా చాలానే వుందని వినిపిస్తోంది. అదే నిజమైతే, 2021 సంక్రాంతికి కాదు కదా, సమ్మర్ కు కూడా కేజిఎఫ్ 2 ను రెడీ చేయడం కష్టమే.

ఒకసారి మోసపోయాను ఈ సారి వదలను

ఈ గడ్డంతో నిద్ర పట్టట్లేదు