హీరోగా మాంచి టాప్ లో వుండగా, ఆ రోజులో భారీగా రెమ్యూనిరేషన్ తీసుకునేవారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు రోజులు మారాయి. రెమ్యూనిరేషన్ లు మారాయి. రీ ఎంట్రీ తరువాత మెగాస్టార్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటారు అన్నది కాస్త ఆసక్తికరం. కానీ రీ ఎంట్రీ తరువాత ఆయన వేరేవాళ్లకు సినిమాలు చేయలేదు. కేవలం స్వంత బ్యానర్ మీదే రెండు సినిమాలు చేసారు. అందువల్ల ఆయన రెమ్యూనిరేషన్ ఎంత అన్న గ్యాసిప్ ల ఎక్కడా వినిపించలేదు.
ప్రస్తుతం టాప్ హీరోలు మహేష్ బాబు 50 కోట్లకు పైగా, ఎన్టీఆర్, బన్నీ లాంటి హీరోలు 35 కోట్లు తీసుకుంటున్న ఈ కాలంలో, మెగాస్టార్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటారు అన్నది పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ మళ్లీ ఎందుకు వచ్చింది అంటే, మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమాకు నిర్మాత రామ్ చరణ్ కాదు. పేరుకు సమర్పణ వుంటే వుండొచ్చు కానీ, ఈ సినిమాకు నిర్మాత నిరంజన్ రెడ్డి. ఆయన తన మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పకుడు మాత్రమే.
అందువల్ల ఈ సినిమాకు మెగాస్టార్ కు రెమ్యూనిరేషన్ ఎంత అన్నది కాస్త గ్యాసిప్ గానైనా బయటకు వచ్చే అవకాశం వుంది. ఈ సినిమాలో నటించడానికి మహేష్ కు ముఫై రోజులకు ముఫై కోట్లు ఆఫర్ చేసారు అని వార్తలు వినిపించాయి. అందువల్ల మెగాస్టార్ కు అంతకన్నా ఎక్కువే రెమ్యూనిరేషన్ వుంటుంది. ప్రస్తుతం టాప్ రెమ్యూనిరేషన్ మహేష్ బాబుదే. యాభై కోట్లకు పైగా. అందువల్లమ మెగాస్టార్ రెమ్యూనిరేషన్ కూడా అదే రేంజ్ లో వుంటుందని, వుండొచ్చని అంచనా.