ఇంతకీ మేఘన టెన్త్ పాస్ అయిందా లేదా..?

తూర్పు గోదావరి జిల్లా బెండపూడి స్కూల్ లో ఇంగ్లిష్ అదరగొట్టిన టెన్త్ క్లాస్ అమ్మాయి మేఘన ఇటీవల టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. టెన్త్ రిజల్స్ట్ వచ్చాక ఆమె ఫెయిలైందని పచ్చ…

తూర్పు గోదావరి జిల్లా బెండపూడి స్కూల్ లో ఇంగ్లిష్ అదరగొట్టిన టెన్త్ క్లాస్ అమ్మాయి మేఘన ఇటీవల టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. టెన్త్ రిజల్స్ట్ వచ్చాక ఆమె ఫెయిలైందని పచ్చ మీడియా ఊదరగొట్టింది. టీడీపీ సీనియర్ నాయకులు కూడా ఆమె పేరు చెప్పకుండా కామెంట్ చేశారు. మరింతకీ మేఘన టెన్త్ పాసయిందా లేదా..? ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్.

ఇంగ్లిష్ లో దంచి కొట్టిన మేఘన, సీఎం జగన్ ప్రశంసలూ అందుకుంది. అలాంటి మేఘన టెన్త్ ఫెయిలైందని, కేవలం ఇంగ్లిష్ పై ఫోకస్ పెట్టి ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రభుత్వం చూసిందని, జగన్ తో కూడా డ్రామా రక్తికట్టించారని, చివరకు ఆమె ఫెయిలైందని టీడీపీ బ్యాచ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టింది.

ఎంత నీఛానికి దిగజారిందంటే.. ఇలా ట్రోలింగ్ జరిగితే.. టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి మానసికంగా ఎంత కుంగిపోతుందో కూడా అర్థం చేసుకోకుండా హడావిడి చేసింది. కానీ వారనుకున్నదేదీ జరగలేదు. మరోసారి టీడీపీ ఫేక్ బ్యాచ్ అడ్డంగా బుక్కైపోయింది.

తోలెం మేఘన – 478 మార్క్స్..

బెండబూడి స్కూల్ లో చదువుకున్న తోలెం మేఘన టెన్త్ క్లాస్ లో 478 మార్క్స్ సాధించింది. ఇంగ్లిష్ లో ఆమె బ్రిలియంట్ అనే విషయం ఇప్పటికే ప్రూవ్ అయింది. మిగతా సబ్జెక్టుల్లో కూడా ఆమె టాప్ అని ఆ మార్క్స్ చెబుతున్నాయి. కానీ టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో మాత్రం నీఛాతి నీఛంగా ప్రవర్తించాయి. రాజకీయాల కోసం స్టూడెంట్ జీవితంతో ఆడుకోవాలనుకున్నాయి.

సాక్షి వెలుగులోకి తెచ్చింది..

మేఘనపై ట్రోలింగ్ మొదలవడంతో సాక్షి నిజ నిర్థారణ చేసింది. మేఘన ఇంటర్వ్యూని కూడా టెలికాస్ట్ చేసింది. పచ్చ బ్యాచ్ గూబ గుయ్యిమనేలా కథనాలిచ్చింది. ఇటీవల వరుసగా ప్రభుత్వంపై ఫేక్ న్యూస్ లతో విరుచుకుపడుతున్న ఎల్లో బ్యాచ్.. అబద్ధాలను కూడా నిజాలుగా భ్రమించేలే చేయడంలో ఎక్స్ పర్ట్. ఇప్పుడు ఈ విషయం మరోసారి రుజువైంది.