టీవీలో వాతావరణ వార్తలు.. మధ్యలో పోర్న్ వీడియో

ఈరోజు వాతావరణ విశేషాలు అంటూ యాంకరమ్మ గలగలా మాట్లాడటం మొదలుపెట్టింది. ఉష్ణోగ్రతలు చెబుతూ.. గ్రాఫిక్ కంటెంట్ ని వాడుకుంటూ మరింతగా వివరణలు ఇస్తోంది. ఇంతలో బ్యాక్ గ్రౌండ్లో బమ్ చిక్ బమ్ మొదలైంది. పోర్న్…

ఈరోజు వాతావరణ విశేషాలు అంటూ యాంకరమ్మ గలగలా మాట్లాడటం మొదలుపెట్టింది. ఉష్ణోగ్రతలు చెబుతూ.. గ్రాఫిక్ కంటెంట్ ని వాడుకుంటూ మరింతగా వివరణలు ఇస్తోంది. ఇంతలో బ్యాక్ గ్రౌండ్లో బమ్ చిక్ బమ్ మొదలైంది. పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది. సదరు టీవీ ఛానెల్ టెక్నికల్ టీమ్ చూసుకోలేదా లేక కావాలనే అలా వదిలేశారో తెలియదు కానీ మొత్తానికి 15 సెకన్ల పాటు ఆ పోర్న్ వీడియో టీవీలో ప్రసారమైంది.

వాస్తవానికి లైవ్ లో వెళ్లే వీడియోకి, టెక్నికల్ గా ఛానెల్ లో ఎయిర్ అయ్యే వీడియోకి 3 సెకన్ల తేడా ఉంటుంది. నీలి చిత్రం కనపడగానే దాన్ని ఆపేసి ఉంటే.. మహా అయితే ఓ ఐదు సెకన్లపాటు అవి అందరికీ కనపడేవి. కానీ ఏం జరిగిందో ఏమో 15 సెకన్లపాటు ఆ నీలిచిత్రం ప్రేక్షకులకు కనపడింది. దీనిపై ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు.

అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా ప్రసారమవుతున్న కెఈఆర్ఎం-2 అనే ఛానెల్ లో ఈ బూతు బొమ్మల వాతావరణ వార్తలు ప్రసారం అయ్యాయి.

ఆదివారం సాయంత్రం న్యూస్ రీడర్ వాతావరణ విశేషాలు అంటూ మొదలు పెట్టగానే, వాతావరణాన్ని వేడెక్కించే పోర్న్ వీడియో తెరపై ప్రత్యక్షమైంది. దీంతో చాలామంది ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. కొందరు ఛానెల్ మార్చేస్తే, ఇంకొందరు అసలు ఏం జరిగిందో తెలుసుకుందామనే ఉద్దేశంతో అలానే చూశారట. ఆ తర్వాత ఈ ఘటనపై సదరు ఛానెల్ వివరణ ఇచ్చుకుని క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగరాని తప్పు జరిగిపోయింది. చివరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

అమెరికాలో బ్రాడ్ కాస్టింగ్ రూల్స్ బాగా కఠినంగా ఉంటాయి. న్యూస్ ఛానెల్ లో ఇలాంటి పోర్న్ వీడియో ప్రసారం చేసినందుకు కేఈఆర్ఎం-2 పై తీవ్రమైన చర్యలుంటాయని తెలుస్తోంది. గతంలో 2012లో వర్జీనియాలోని రోనోక్ అనే న్యూస్ స్టేషన్లో సాయంత్రం వార్తల్లో ఇలాంటి పోర్న్ వీడియోలు ప్రసారం అయ్యాయి. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన పోలీసులు ఛానెల్ నిర్వాహకులపై కేసులు పెట్టారు. కోర్టు విచారణ అనంతరం 3.25లక్షల డాలర్ల జరిమానా విధించారు.