ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన రాష్ట్రంలోని ప్రతి ఇంటిలోనూ తాను ఒక కుటుంబసభ్యుడినని మరోమారు నిరూపించుకున్నారు. వృద్ధులకు మనవడినని, ఆడపడచులకు సోదరుడినని చెప్పుకునే జగన్.. పిల్లలందరికీ మేనమామనని మరోసారి తన చేతలతో గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలందరికీ శాంసంగ్ ట్యాబ్ లను ఉచితంగా పంపిణీ చేయడం, వాటిలో ఎంతో విలువైన బైజూస్ వారి ప్రీలోడెడ్ పాఠాలతో ఇవ్వడం విశేషం.
ఇక్కడ ప్రధానంగా జగన్ ను అభినందించాల్సిన విషయాలు రెండుమూడు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో డిజిటల్ సెటప్ బాక్సులు లాంటివి ప్రజలకు విక్రయించే వ్యవహారాలు జరిగాయి. అయితే.. అవేవీ బ్రాండెడ్ వి కావు. చంద్రబాబు తైనాతీలు షెల్ కంపెనీలను పుట్టించి..వంకర టింకరగా అసెంబుల్డ్ సెట్లు తయారుచేసి వాటిని భారీ బ్రాండెడ్ ధరలకు ప్రజలకు అంటగట్టి దోచుకున్నారు. కానీ జగన్ అలాంటి వెధవ్వేషాలకు అవకాశం ఇవ్వలేదు. మార్కెట్లో ఏవైతే ఉత్తమమైన ట్యాబ్ లుగా పరిగణనలో ఉన్నాయో అలాంటి శాంసంగ్ ట్యాబ్ లను కొనుగోలు చేసి ఇచ్చారు.
రెండో సంగతి ఏంటంటే.. పిల్లలకు పాఠాలు నేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడేలా ఆ ట్యాబ్ లకు కంట్రోల్స్ విధించి ఇవ్వడం. మీరు చూడాలనుకునేవన్నీ అందులో చూడడానికి వీల్లేదు, జగన్ మామ వాటిని ముందే తీసేశాడు, పాఠాలు మాత్రమే నేర్చుకోవాలి అంటూ జగన్ వాటిని అందజేసిన నాడే వెల్లడించడం విశేషం.
పిల్లలకు జగన్ మామ ఇచ్చిన కానుకను కేవలం దాని ధరతో కొలవడానికి వీల్లేదు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది గనుక వాటిలో చెత్తాచెదారం చూసే అవకాశం లేకుండా చేసి.. వారి మీద జగన్ చూపించిన శ్రద్ధ కొలమానాల్లో కొలవాలి. పిల్లలకు ఈ ట్యాబ్ లు ఎంతో ఉపయోగపడతాయనడంలో కొత్త విషయం ఏమీలేదు. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారిపోతున్న తరుణంలో.. పిల్లలను చిన్నతనం నుంచి డిజిటల్ కిడ్స్ గా తయారుచేయడానికి జగన్ మామ పెడుతున్న శ్రద్ధ ఇది అని అనుకోవాలి.
సాధారణంగా చంద్రబాబునాయుడు తనను తాను టెకీగా అభివర్ణించుకుంటూ డప్పుకొట్టుకుంటారు. ఆయన సొంత డప్పు కొట్టుకోవడమే తప్ప రాష్ట్రం కోసం టెక్ పరంగా ప్రజలకోసం ఏం చేశారో తెలియదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి.. రేపటి తరం మొత్తం డిజిటల్ పౌరులుగా తయారు కావడానికి ఈ పద్ధతి ద్వారా పటిష్ఠమైన పునాది వేస్తున్నారు.
బైజూస్ పాఠాలు మాత్రమే అనేది మనం మర్చిపోవాలి. బైజూస్ తో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా పిల్లలకు వీడియో, డిజిటల్ పాఠాలు అందించే ఏదో ఒక ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. వారి వికాసానికి జగన్ ఇంతగా శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు.. స్టూడెంట్స్ ఉన్న ఏ ఇంట్లో మాత్రం ఆయనను ఎలా మర్చిపోగలరు?