చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్న వైసీపీ నాయకుడు

వైసీపీలో మరో హార్డ్ కోర్ తిరుగుబాటుదారుడు సీఎం జగన్ మీద దారుణమైన కామెంట్స్ చేశాడు. అంటే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నాడు. ఈ వైసీపీ నాయకుడు…

వైసీపీలో మరో హార్డ్ కోర్ తిరుగుబాటుదారుడు సీఎం జగన్ మీద దారుణమైన కామెంట్స్ చేశాడు. అంటే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నాడు. ఈ వైసీపీ నాయకుడు మరెవరో కాదు కడప జిల్లాకే చెందిన డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి. వైఎస్ఆర్‌సీపీకి ఈ సారి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని ఆయన శాపం కూడా పెట్టాడు. గత ఎన్నికలకు ముందు తన ఇంటికి ప్రత్యేక దూతల్ని పంపించి మరీ పార్టీలో చేర్చుకున్నారని.. ఇప్పటికీ తాను వైసీపీలోనే ఉన్నానని చెప్పాడు.  వైసీపీ వాళ్లేమీ తనను తీసేయలేదని అన్నాడు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని మీడియా సమావేశంలోనే చెప్పాడు. పరిపాలన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారు.. ఆ పార్టీలో నేను ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉందని అని కూడా అన్నాడు. రాష్ట్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్ల ోఎవరూ కాపాడలేరని.. ఒక్క చంద్రబాబు మాత్రమే కాపాడతాడని అన్నాడు. పవన్ కల్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేం కానీ ఆయనకు అనుభం లేదని డీఎల్ రవీంద్రారెడ్డి కామెంట్ చేశాడు.

రాష్ట్రం కోసం వారిద్దరూ కలిసి పోటీ చేస్తారని అనుకుంటాడని అన్నాడు. వైఎస్ జగన్ పాలనలో ఏవర్గం ప్రజలు సంతృప్తికరంగా లేరని, దోచుకోవడమే తప్ప జగన్ కు ఈ నాలుగేళ్లలో రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన  పొత్తు ఉంటుందని డీఎల్ అన్నాడు. ఇద్దరూ కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పాడు.  ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేవుడు వచ్చినా  కాపాడలేదన్నాడు. చంద్రబాబు సీఎం అయితే  కొంత వరకు ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

మరో నేత ఎవరూ ఇప్పుడు కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందన్నాడు. కడప జిల్లా మైదుకూరు నుంచి 1978 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు ఘన విజయం సాధించాడు డీఎల్ రవీంద్రా రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన ఆయన రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.

టీడీపీలోకి రావాలని ప్రయత్నించినప్పటికీ.. స్థానిక నేత పుట్టా సుధాకర్ యాదవ్ బలంగా వుండటంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. అయితే 2019లో వైసీపీకి జై కొట్టిన డీఎల్‌కు జగన్ సరైన గుర్తింపునివ్వలేదని… ఎవరూ పట్టించుకోకపోవడతో ఆయన వైఎస్ఆర్‌సీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనను బుజ్జగించేందుకు కూడా వైసీపీ నేతలు ప్రయత్నించడం లేదు.