సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా టిల్లూ స్క్వేర్. డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ ప్రాజెక్టులోకి అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమెతో 10 రోజులు షూటింగ్ కూడా చేశారు.
అంతలోనే ఏమైందో ఏమో ఆ ప్రాజెక్టు నుంచి అనుపమ తప్పుకుంది. ఆ తర్వాత మడొన్నా సెబాస్టియన్, మీనాక్షి చౌదరి లాంటి కొన్ని పేర్లు వినిపించాయి. కట్ చేస్తే, తాజాగా మళ్లీ అనుపమ పరమేశ్వరన్ పేరే తెరపైకొచ్చింది. యూనిట్ తో ఆమెకు ప్యాచప్ అయిందని, మళ్లీ ఆమెనే తీసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై స్పందించడానికి అంగీకరించలేదు అనుపమ. 18-పేజెస్ ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ, “మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ అందరూ రాసేశారు, అంతకుమించి చెప్పడానికేం లేదు” అంటూ తప్పించుకుంది.
తన అప్ కమింగ్ ప్రాజెక్టుల వివరాలు వెల్లడించే క్రమంలో, రవితేజతో ఈగల్ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పేసింది అనుపమ. నిజానికి ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇదే టైమ్ టిల్లూ స్క్వేర్ పై అడిగితే మాత్రం, నేను నిర్మాతను కాదు, అధికారికంగా చెప్పలేను అంటూ టాపిక్ మార్చేసింది.
“మరీచక అనే సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. లక్ష్మీభూపాల్ సినిమా అది. ఇంకా డబ్బింగ్ చెప్పలేదు. జయం రవితో సైరన్ అనే సినిమా చేస్తున్నాను. రవితేజ సరసన ఈగల్ సినిమాలో నటిస్తున్నాను. ఇంకొన్ని ప్రాజెక్టులున్నాయి కానీ నేను వాటిని అధికారికంగా ప్రకటించలేను. ఎందుకంటే, నేను నిర్మాతను కాదు కదా.”
నిఖిల్ తో కలిసి వరుసగా రెండోసారి థియేటర్లలోకి వస్తున్న అనుపమ, తనది-నిఖిల్ ది హిట్ పెయిర్ అనిపించుకుంటుందని చెబుతోంది. శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది 18-పేజెస్ సినిమా.