ది వరల్డ్ ఆఫ్ బెదురులంక

ఈ మధ్యకాలంలో ఏదో సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంటే తప్ప జనం సినిమా చూడడం లేదు. కొత్త కొత్త ఐడియాలు తెరపైకి రావాల్సి వుంది. తేవాల్సి వస్తోంది కూడా. హీరో కార్తికేయ నటిస్తున్న…

ఈ మధ్యకాలంలో ఏదో సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంటే తప్ప జనం సినిమా చూడడం లేదు. కొత్త కొత్త ఐడియాలు తెరపైకి రావాల్సి వుంది. తేవాల్సి వస్తోంది కూడా. హీరో కార్తికేయ నటిస్తున్న బెదురులంక 2012 అనే సినిమా నుంచి ఈ రోజు విడుదల చేసిన వీడియో చూస్తే ఇలాగే అనిపిస్తుంది. 

అసలు టైటిల్ నే చిత్రంగా వుంది. ఇప్పుడు వదిలిన క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో చూస్తే భలే గమ్మత్తుగా వుందిగా అనిపిస్తుంది. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గ్లింప్స్ భలే చిత్రంగా వుంది. ఒక విధంగా చెప్పాలంటే కాస్త సర్రియలిస్టిక్ ధోరణి కనిపించింది.

ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో 'బెదురులంక 2012' చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శక – నిర్మాతలు ఇంతకు ముందు తెలిపారు. 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక 2012' వీడియోలో ఆ ఊరిని, అందులో మనుషులను పరిచయం చేశారు. సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో కార్తికేయ, నేహా శెట్టి  మధ్య ప్రేమతో పాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, 'ఆటో' రామ్ ప్రసాద్ క్యారెక్టర్లనూ దర్శకుడు క్లాక్స్ పరిచయం చేశారు. యుగాంతం వస్తుందని ఊరిలో ప్రజలు అందరూ ఎంజాయ్ చేసే విధానం నవ్వులు పూయించేలా ఉంది.

చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ “సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులు అందరినీ నవ్వించే కొత్త తరహా చిత్రమిది. జనవరి తొలి వారంలో టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక' వీడియోలో చూశారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అంత కంటే బావుంటాయి అని చెప్పారు.