తన స్నేహితుడు త్రివిక్రమ్ ను అడిగితే చెబుతాడు పవన్ కు. ఒకర్ని ఓడించేందుకు పోరాటం చేయడం కాదు. మనం గెలవడానికి పోరాట చేయాలి అని. 2019లోనూ పవన్ ది ఒకటే మాట. 2024లోనూ అదే మాట. జగన్ ను అధికారంలోకి రానివ్వను అని. 2019లో ఇలాగే అన్నారు. ఛాలెంజ్ చేసారు. కానీ ఏం జరిగింది. బహుశా అది దృష్టిలో వుంచుకునే కావచ్చు వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పదే పదే అంటున్నారు. అంటే 2019లో జగన్ వ్యతిరేక ఓటును చీల్చింది తానే అని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు చీలనివ్వను అంటున్నారు అంటే మళ్లీ తెలుగుదేశం వైపు వెళ్తా అని చెప్పకనే చెబుతున్నారనుకోవాలి.
సరే ఇప్పుడు విషయం అది కాదు. పవన్ మొన్నటి 2019 ఎన్నికల్లో పోటీ చేసారు. తన ప్రత్యర్థి గ్రంథి శ్రీనివాస్ ను ఓడించండి అని పిలుపు ఇచ్చారా? లేదు కదా? నన్ను గెలిపించండి అని అన్నారు. అంతే తప్ప గ్రంధి శ్రీనివాస్ ఎలా గెలుస్తాడో చూస్తాను అని అనలేదు కదా. మరి ఇప్పుడు ఏమయింది. జనసేనను గెలిపించడి. జనసేనకు అధికారం ఇవ్వండి…నన్ను సిఎమ్ ను చేయండి అనడం లేదేమీ? జగన్ ను దించండి..జగన్ ను ఓడించండి అంటారేంటీ? సరే జగన్ ను దించి ఎవర్ని సిఎమ్ చేయాలో కూడా చెప్పాలి. కదా. కనీసం మాట వరసకు అయినా జనసేనను అధికారంలోకి తెండి నన్ను సిఎమ్ ను చేయండి అని చెప్పరేం?
జనసేను అధికారంలోకి వస్తుంది..నేనే సిఎమ్ అభ్యర్థిని అని చెప్పవచ్చు కదా..తనను సిఎమ్ చేయండి అని చెప్పరు. కేవలం జగన్ ను కుర్చీ నుంచి లాగేయండి…జగన్ ను అధికారానికి దూరం చేయండి అంటారు తప్ప, జగన్ ను దించేస్తే, జగన్ కు ప్రత్యామ్నాయంగానే సిఎమ్ అభ్యర్థిని నేనే అని ఎందుకు చెప్పుకోరు. పోటీ పెర్ ఫెక్ట్ గా చూపిస్తే కదా జనం ఎవర్ని ఎంచుకోవాలి అనేది డిసైడ్ చేసుకుంటారు. జగన్ కు మారుగా సిఎమ్ చంద్రబాబు నా, పవన్ నా అన్న ఛాయిస్ మీద క్లారిటీ రావాలి కదా. జనసేనకు అధికారం వస్తుంది అంటారు. కానీ తాను సిఎమ్ కేండిడేట్ అని చెప్పకోరు. జగన్ ను మాత్రం ఓడించేయండి అంటారు.
అంటే పవన్ మనసులో ఏం వున్నట్లు? తను సిఎమ్ కేండిడేట్ అని చెబితే తెలుగుదేశం అనుకూల వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే క్లారిటీ పవన్ కు వుంది. ఒకసారి నేనే సిఎమ్ కేండిడేట్ అని పవన్ అనౌన్స్ చేసిన మరుక్షణం తనను ఆడేసుకుంటారనే భయం వుండి వుండాలి. లేదా తాను కాదు, చంద్రబాబు కదా..అది ఇప్పుడు చెబితే ‘పల్లకీ మోస్తున్నాడు’ అనే ప్రచారం మరింత ఊపు అందుకుంటుంది అనే భయం కూడా వుండి వుండాలి.
అందుకే గెలిపించండి అని అడగడం లేదు పవన్..జగన్ ను ఓడించండి అంటున్నాడు. జగన్ నుంచి అధికారం లాగేయండి అంటున్నాడు. కానీ లాగేసి అధికారం తనకు ఇవ్వాలా? చంద్రబాబుకు ఇవ్వమంటాడా అన్నది మాత్రం క్లారిటీగా చెప్పడం లేదు. వాటినే అతి తెలివితేటలు అంటారేమో?