బాహుబలి లైవ్ కన్సర్ట్.. జాగ్రత్తపడిన ప్రభాస్-అనుష్క

ప్రసిద్ధ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి లైవ్ కన్సర్ట్ ముగిసింది. 148 ఏళ్ల రాయల్ ఆల్బర్ట్ హాల్ చరిత్రలో ఇంగ్లిష్ కాకుండా, మరో భాష సినిమాకు సంబంధించి లైవ్ కన్సర్ట్ జరగడం ఇదే…

ప్రసిద్ధ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి లైవ్ కన్సర్ట్ ముగిసింది. 148 ఏళ్ల రాయల్ ఆల్బర్ట్ హాల్ చరిత్రలో ఇంగ్లిష్ కాకుండా, మరో భాష సినిమాకు సంబంధించి లైవ్ కన్సర్ట్ జరగడం ఇదే తొలిసారి. అది కూడా ఓ తెలుగు సినిమాకు ఈ అరుదైన గౌరవం దక్కడం గొప్ప విశేషం.

కీరవాణి ఆధ్వర్యంలో బాహుబలి ది బిగినింగ్ కు సంబంధించిన స్కోర్ ను లైవ్ లో ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించారు.

ఆ వెంటనే కొద్దిసేపు ప్రశ్నా-జవాబు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇలా లండన్ కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల నుంచి రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఒకటే సందడి.

రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హాల్ బయటకు అభిమానులతో వీళ్లు ఫొటోలు దిగారు. వీళ్లను కలిసేందుకు మరోసారి జపాన్ నుంచి చాలామంది అభిమానులు లండన్ కు వచ్చారు. ప్రత్యేకంగా ఫొటోలు దిగారు.

ఈ సందర్భంగా బాహుబలి యూనిట్ దిగిన ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రభాస్-అనుష్క కలిసి మరోసారి వేదికను పంచుకోవడంతో ఈ స్టిల్స్ వైరల్ గా మారాయి.

అయితే ఫొటోలకు పోజులిచ్చే క్రమంలో ప్రభాస్-అనుష్క చాలా జాగ్రత్తపడినట్టు కనిపించింది. ఇద్దరూ పక్కపక్కన నిల్చున్న లేదా కూర్చున్న ఫొటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు.

తెరవెనక ఎలా ఉన్నప్పటికీ, కెమెరా ముందుకొచ్చేసరికి మాత్రం వీళ్లిద్దరి మధ్య రాజమౌళి లేదా రానా ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఇలా తమపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఈ జంట.