Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ ముగ్గురికే దక్కిన గౌరవం

ఆ ముగ్గురికే దక్కిన గౌరవం

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోడీ ఇచ్చిన విందు సమావేశంలో పాల్గొనే అవకాశం తెలుగునాట ముగ్గురికే దక్కినట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు, గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, మీడియా టైకూన్ రామోజీ తనయుడు కిరణ్ కు మాత్రమే ఆహ్వానాలు అందాయి.

బాలీవుడ్ తారలు, ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం మీద మెగాహీరో, అపోలో సంస్థ వారసురాలు ఉపాసన ఆసక్తికరమైన ట్వీట్ వేసిన సంగతి, అది వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

భారతదేశంలోని దక్షిణప్రాంతంలో వున్న ఫిలిం పర్సనాలిటీలను పిలవకుండా కేవలం హిందీ వారిని మాత్రమే పిలవడం పట్ల తాను ఫీలయ్యానని ఆమె తన ట్వీట్ ద్వారా స్మూత్ గా వెల్లడించారు. 

ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇలాంటి నేఫథ్యంలో ఆరా తీస్తే, తెలుగునాట నుంచి దిల్ రాజు, ఎస్పీబీ, చెరుకూరి కిరణ్ లకు ఆహ్వానాలు అందినట్లు తెలిసింది. వారు హాజరయినట్లు తెలుస్తోంది. 

పాట అందించిన రామోజీ

గాంధీ 150వ జయంతి సందర్భంగా ఓ ప్రత్యేక గీతాన్ని మీడియా టైకూన్ రామోజీ తయారుచేయించి పంపినట్లు తెలుస్తోంది. ఈ గీతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా పాలు పంచుకున్నారు. అందుకే రామోజీ తనయుడు కిరణ ను, ఎస్పీబీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దిల్ రాజును మాత్రం నేరుగా ఫంక్షన్ కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?