ఎన్టీఆర్ బావమరిది, నార్నే శ్రీనివాసరావు కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని కొన్ని నెలల క్రితమే వెల్లడించాం. అయితే ఆ ఎంట్రీ డైరక్టర్ తేజ చేతుల మీదుగా జరిగే అవకాశం మిస్ అయిపోయిందన్నది లేటెస్ట్ సంగతి.
విషయం ఏమిటంటే డైరక్టర్ తేజ కొత్త హీరోను పరిచయం చేస్తూ సినిమా చేయాలనుకున్నారు. ఆయనే నిర్మాత. గతంలో వచ్చిన చిత్రం సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా చిత్రం 2 అన్నది టైటిల్.
ఈ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ బావమరిది ని సెట్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. నిర్మాణంలో కొంత భాగాన్ని నార్నే శ్రీనివాసరావు భరించేలా బేరాలు సాగాయి.
కానీ తేజ అడిగిన మొత్తం చాలా ఎక్కువ కావడంతో హీరో సైడ్ నుంచి డ్రాప్ అయిపోయారు. అంత ఖర్చు భరించి వేరే బ్యానర్ లో లాంచ్ చేయడం కన్నా, తామే ప్రొడ్యూస్ చేసుకోవడం బెటర్ అని ఆగిపోయారు.
ఇప్పుడు తేజ ఇలా డబ్బులు భరించేవారు ఎవ్వరూ లేకపోతే తన కొడుకునే హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నారని బోగట్టా.