ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కన్నడ దర్శకుడు నర్తన్ దే. కన్నడంలో మఫ్టీ సినిమా డైరక్టర్ గా మన వాళ్లందరికీ పరిచయం. మన టాప్ హీరోలు అందరికీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలే కావాలి. అందుకోసం తమిళ, కన్నడ డైరక్టర్ల వైపు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో వినిపిస్తున్న పేరు నర్తన్. అయితే ఇదే డైరక్టర్ పేరును ఇద్దరు హీరోల సినిమాలతో లింక్ చేస్తూ వార్తలు వినిపిస్తున్నాయి.
యువి సంస్థ..ఓ కన్నడ సంస్థ కలిసి నిర్మించే రామ్ చరణ్ సినిమాకు నర్తన్ దర్శకుడు అని ఒకటి.
దిల్ రాజు..ఓ కన్నడ సంస్థ కలిసి నిర్మించే విజయ్ దేవరకొండ సినిమాకు నర్తన్ దర్శకుడు అని. పైగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లాయర్ క్యారెక్టర్ చేస్తున్నాడు అని.
మరి ఇంతకీ నర్తన్ రెండు తెలుగు సినిమాలు చేయబోతున్నాడా? ఒకటే చేస్తాడా? లేదు రెండూ చేస్తే ఏది ముందు? ఏది వెనుక? ఇలాంటి ప్రశ్నలు చాలా వున్నాయి.
గమ్మత్తేమిటంటే ఇద్దరు హీరోలకు వేరే ప్రాజెక్టులు వార్తల్లో వున్నాయి. రామ్ చరణ్ కు ఉప్పెన బుచ్చిబాబు సినిమా వుంది. విజయ్ దేవరకొండకు జెర్సీ గౌతమ్ తిన్ననూరితో సితార సంస్థలో సినిమా వుంది. ఇవి వుండగానే ఈ నర్తన్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.