ఆరేళ్ల కిందటి మాటలే మోడీ ఇప్పుడు కూడా!

'కాంగ్రెస్ నాశనం చేసింది..'ఇదీ ప్రధానమంత్రి మళ్లీ చెబుతున్న డైలాగ్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ డైలాగ్ పునరావృతం చేశారు.  ఈ డైలాగ్ ను భారతీయ జనతా పార్టీ వాళ్లు చాలా సంవత్సరాలుగా…

'కాంగ్రెస్ నాశనం చేసింది..'ఇదీ ప్రధానమంత్రి మళ్లీ చెబుతున్న డైలాగ్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ డైలాగ్ పునరావృతం చేశారు.  ఈ డైలాగ్ ను భారతీయ జనతా పార్టీ వాళ్లు చాలా సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ  అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాటే చెప్పారు.

ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినప్పటి నుంచి మోడీ కూడా ఇదే మాటే చెబుతూ ఉన్నారు. 'కాంగ్రెస్ నాశనం చేసింది, అరవై యేళ్ల కాంగ్రెస్ పాలన అంటూ..'విమర్శలు చేస్తూ అధికారం చేపట్టారు. అయితే అధికారం చేపట్టి ఇప్పటికే ఐదేళ్లు పూర్తి అయ్యాయి బీజేపీ వాళ్లు. మోడీ ప్రధానమంత్రిగా ఆరో సంవత్సరం గడుపుతున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో కూడా మోడీ మళ్లీ  ఆరేళ్ల కిందటి మాటనే మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని నిందించడమే  మోడీ ఎన్నికల ప్రచారం అవుతూ ఉంది.

అరవై యేళ్లు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే.. ఇప్పుడు అందులో పదో వంతు సమయం అయినా మోడీ ప్రధానిగా ఉన్నారు. ఈ ఆరేళ్లలో చేసిన అద్భుతాలు ఏమైనా ఉంటే వాటిని చెప్పి ప్రచారం చేసుకోవాల్సింది. ఆ విషయంలో మోడీ చెబుతున్న మాట ఒకటే. ఆర్టికల్ త్రీ సెవెన్టీ రద్దు. ఈ విషయాన్ని కశ్మీర్ లో ఎన్నికలు  నిర్వహించి ప్రచారాస్త్రంగా మారిస్తే బాగుంటుంది. హర్యానాలో అక్కడి వారి గురించి, మహరాష్ట్రలో రైతుల సమస్యల గురించి మాట్లాడి ఓటు అడిగితే  అప్పుడు  కదా..కమలం పార్టీకి ఎవరైనా జై కొట్టేది!