ఒక్కోసారి అందం చిక్కులు తెస్తోంటోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తుండడంతో చేయని తప్పుకు మానసిక వేదన అనుభవించే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎవరో చేసే తప్పునకు…మరెవరో శిక్ష అనుభవించాల్సి వస్తోంది. ఇలాంటి అనుభవం మిస్ ఇండియా మాజీ ఫైనలిస్ట్, సివిల్స్ 2019 ర్యాంకర్ ఐశ్వర్యకు ఎదురైంది.
ఐశ్వర్యపై ముంబయ్ పోలీసులు కేసు నమోదు చేయడం వెనుక ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. మిస్ ఇండియా పోటీల్లో వివిధ దశలను దాటుకుని…ఫైనలిస్ట్‌గా ఐశ్వర్య నిలిచింది. చూపు పక్కకు మరల్చుకోలేనివ్వని అందం ఆమె సొంతం. అందానికి తగ్గట్టు తెలివి తేటల్లోనూ టాపరే. తాజాగా వెల్లడైన యూపీఎస్సీ ఫలితాల్లో ఐశ్వర్య 93వ ర్యాంకు సాధించారు.
అందగత్తె అయిన ఐశ్వర్య పేరుతో ఎవరో ఆకాతాయిలు 20 నకిలీ ఇన్‌గ్రామ్ అకౌంట్లు తెరిచారు. దీనిపై 23 ఏళ్ల యువకుడు కొలాబా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఐటీ యాక్ట్ కింద ఆమెపై ఇటీవల ముంబయ్ పోలీసులు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు.
అయితే తనపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో ఐశ్వర్య ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అసలు తనకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేదని, అలాంటప్పుడు ఏకంగా 20 అకౌంట్లు ఎలా వచ్చాయని ఐశ్వర్య ఆశ్యర్యంతో ప్రశ్నించారు. కావాలనే ఎవరో తన పేరుతో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేయడమే కాకుండా తన ఫొటోలు, వీడియోలు పెడుతునున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.