మరో వారంలో థియేటర్లలోకి వస్తుందనగా కరోనా వైరస్ వల్ల ‘వి’ చిత్రం విడుదల నిరవధికంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఎలాగయినా కొనేసి, ఓటిటి ద్వారా విడుదల చేసి సబ్‌స్క్రైబర్లను పెంచుకోవాలని చాలా సంస్థలు పోటీ పడ్డాయి. అయితే నాని, దిల్ రాజు ఇద్దరూ కూడా ఓటిటి రిలీజ్ పట్ల సుముఖంగా లేరు. ఎంత లేటయినా థియేటర్లలోనే విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
నాని సినిమాకు ముప్పయ్ కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. ఓటిటి, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఇలా చాలానే గిట్టుబాటు అవుతుంది. అందుకే ఓటిటి సంస్థలు ఎంత ఆఫర్ చేసినా ‘వి’కి అది తక్కువే అవుతుంది. ఈ చిత్రం విడుదలలో జాప్యం వల్ల నిర్మాతగా దిల్ రాజుకి జరిగే నష్టం షేర్ చేసుకోవడానికి నాని అంగీకరించినట్టు టాక్ వుంది.
ఇంతకీ వి రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నట్టు? దసరాకి వస్తుందని ఊహాగానాలు సాగుతున్నాయి కానీ క్రిస్మస్ అయితే బెస్ట్ అని దిల్ రాజు డిసైడ్ అయ్యాడట. ఎంసిఏ అదే సీజన్‌లో రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ కావడంతో ఆ సెంటిమెంట్ కూడా క్రిస్మస్ రిలీజ్ వైపు మొగ్గు చూపేట్టు చేస్తోందట. అన్నీ బాగుంటే ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను ఆ టైమ్‌లో రిలీజ్ చేయాలని నాని ప్లాన్ చేసాడు. ఇప్పుడు అనుకోకుండా ‘వి’ ఆ డేట్‌కి వెళ్లింది.