అవును..సమంతకు ఓ హీరో కావాలి. సమంత తెలుగులో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయబోతోంది.
Advertisement
కొత్త దర్శక ద్వయం ఈ సినిమాకు పని చేస్తున్నారు. శ్రీదేవీ మూవీస్ కృష్ణ ప్రసాద్ నిర్మాత. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ అని తెలుస్తోంది.
ఈ సినిమాకు హీరో కావాలి ఇప్పుడు. అందుకే వెదుకలాట సాగుతోందని తెలుస్తోంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనేసరికి మన హీరోలు మొహం చాటేస్తారు. అలా అని మరీ చిన్న చితక హీరోను తీసుకుంటే సమంత పక్కన బాగోదు.
అందుకే ఎవరు..ఎవరు..ఎవరు అంటూ ఆలోచనలు సాగుతున్నాయి. నవంబర్ లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.