'మా' ఎన్నికలు టాలీవుడ్‌లో స్పష్టమైన విభజన తీసుకొచ్చిందనేది ఎవరూ కాదనలేరు. కానీ తామంతా ఒకటేనని, కళామతల్లి బిడ్డలమని సినీ నటులు ఎంత చెప్పినా నమ్మే వాళ్లెవరూ లేరు.
ఎందుకంటే, ఒకే వేదికపై మంచు విష్ణు, పవన్‌కల్యాణ్ పరస్పరం ఎదురెదురుగా తారసపడినా పలకరించుకోని పరిస్థితి. ఇదంతా లోకం గమనిస్తోంది. దాచినా దాగని నిజాల్ని …తమకు తాముగా సినీ సెలబ్రిటీలు బయట పెట్టుకున్నారు.
తమ మధ్య విభేదాల్ని తామే బయటి ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, అగ్రహీరో పవన్‌కల్యాణ్ పరస్పరం మాట్లాడుకోకపోవడంపై టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసింది.
నిన్నరాత్రి రేణిగుంట విమానాశ్రయంలో దిగిన మంచు లక్ష్మిని ఇదే విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మంచు లక్ష్మి స్పందిస్తూ… జనసేన అధినేత పవన్‌కల్యాణ్, మా అధ్యక్షుడు విష్ణు కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నారన్నారు. నటి మంచు లక్ష్మి తెలిపారు.
ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ ఒక్క ఫొటో తీసి ఏదేదో మాట్లాడుకుంటున్నారని, అంతా కలిసే ఉన్నామని ఆమె చెప్పడం గమనార్హం. ఇదే నిజమైతే…అలయ్‌బలయ్ కార్యక్రమంలో వేదికపై పవన్ ఉన్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన విష్ణు ‘ఈయన ఎవరో ఊహించగలరా?’ అంటూ వ్యంగ్యంగా పెట్టిన పోస్ట్ కథేంటో మంచు లక్ష్మి చెప్పగలరా?