మొదటిస్థానంలో బిర్యానీ..రెండో స్థానంలో మసాలా దోశ

ఎప్పట్లానే ఈ ఏడాది కూడా భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకాల్లో బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది. బిర్యానీ ఇలా అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా ఏడో సారి. 2022 సంవత్సరానికి గాను ఫుడ్…

ఎప్పట్లానే ఈ ఏడాది కూడా భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకాల్లో బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది. బిర్యానీ ఇలా అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా ఏడో సారి. 2022 సంవత్సరానికి గాను ఫుడ్ ట్రెండ్స్ ను విడుదల చేసింది స్విగ్గీ. ఇందులో పలు ఆసక్తికర అంశాలున్నాయి.. అవేంటో చూద్దాం

ఈ ఏడాది భారతీయులు నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు (వెజ్, నాన్ వెజ్ కలిపి) ఇచ్చారు. అలా ఈ వంటకం మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లలో రెండో స్థానంలో దోశ నిలిచింది. దోశ రకాల్లో ఎక్కువమంది మసాలా దోశ ఆర్డర్ ఇచ్చారంట. ఇక స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిన టాప్ వంటకాల్లో పన్నీర్ బట్టర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, బటర్ నాన్ టాప్ లిస్ట్ లో నిలిచాయి.

ఇక స్విగ్గీలో పచారీ సామాన్ల విషయానికొస్తే, బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ అత్యథికంగా స్విగ్గీ ఇనస్టామార్ట్ ను వాడాడు. అతడు ఏకంగా 16 లక్షల 60వేల రూపాయల విలువైన కిరాణ, నిత్యావసర సరుకుల్ని ఈ ఏడాది స్విగ్గీలో అర్డర్ చేశాడు.

ఇక బెంగళూరుకే చెందిన మరో వినియోగదారుడు, దీపావళి సందర్భంగా ఏకంగా 75,378 రూపాయల విలువైన సింగిల్ ఆర్డర్ ఇచ్చాడు. ఇక మూడో స్థానంలో పూణెక్ చెందిన ఓ కంపెనీ యజమాని, తన స్టాఫ్ మొత్తానికి ఒకేసారి 71,229 రూపాయల విలువ చేసే బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాడు.

చిరుతిళ్లు (స్నాక్స్‌) విషయానికొస్తే.. ఈ ఏడాది కూడా భారతీయులు ఎక్కువగా సమోసాలనే ఆర్డర్ చేశారు. వీటితో పాటు పాప్‌కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్, హాట్ వింగ్స్, టాకోస్ ఎక్కువగా ఆర్డర్ చేసిన జాబితాలో టాప్ లో నిలిచాయి. ఇక ఎక్కువగా ఆర్డర్ చేసిన టాప్ 10 స్వీట్ల జాబితాలో గులాబ్ జామూన్, రసమలై, చాకో లావా కేక్, రసగుల్లా, చోకో-చిప్స్ ఐస్ క్రీం ఉన్నాయి.

ఆరోగ్యపరంగా కూడా భారతీయులు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాన్ని స్విగ్గీ వెల్లడించింది. ఈ ఏడాది 50 లక్షల కిలోల ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను ఆన్ లైన్ లో ఆర్డర్ చేశారంట.