గాసిప్స్‌పై సమంత సైలెన్స్

సమంత ఇక నటించదంటూ ఈమధ్య మీడియాలో ప్రచారం బాగా ఎక్కువయింది. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమయిన సమంత ఇంటి పని, తోట పని చేసుకుంటూ… ఆ వీడియోలనే ఫాన్స్‌తో పంచుకుంటూ సినిమాలకు దూరంగా వుంటోంది. లాక్‌డౌన్‌కి…

సమంత ఇక నటించదంటూ ఈమధ్య మీడియాలో ప్రచారం బాగా ఎక్కువయింది. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమయిన సమంత ఇంటి పని, తోట పని చేసుకుంటూ… ఆ వీడియోలనే ఫాన్స్‌తో పంచుకుంటూ సినిమాలకు దూరంగా వుంటోంది. లాక్‌డౌన్‌కి ముందు ఒప్పుకున్న సినిమాలు తప్ప ఆమె కొత్తగా ఏ అసైన్‌మెంట్ టేకప్ చేయలేదు.

సమంత పూర్తిగా సినిమాలు మానేసిందంటూ ప్రచారం జరుగుతోంటే, మరోవైపు ఓ బేబీ లాంటి స్పెషల్ సినిమాలైతేనే చేస్తుందని మరో టాక్ వుంది. ఇంకోవైపు భర్త చైతన్యతో కలిసి సొంత నిర్మాణ సంస్థ పెడుతోందని, తనకు నచ్చిన సినిమాలను నిర్మిస్తుందని మరో గాసిప్ కూడా సర్కులేట్ అవుతోంది.

తన గురించి ఇలా చాలా రకాల ఊహాగానాలు సాగుతున్నా కానీ సమంత మాత్రం దేనికీ ఊఁ కొట్టడం లేదు. అలా అని ఖండించడం లేదు. ముప్పయ్ మూడేళ్ల సమంత మరి ఇక నటన తగ్గించేసి గృహిణి బాధ్యతలేక పరిమితం అవుతుందా లేక సెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ఫాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుందా, లేక నిర్మాతగా మారి తన అభిరుచిని చాటుకునే సినిమాలు చేస్తుందా? సమాధానం కోసం సమంత పెదవి విప్పే వరకు ఎదురు చూడాల్సిందే. 

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?