కొరటాల కావాలంటే అక్కడకు వెళ్లాల్సిందే!

రాజమౌళి కేవలం పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే పరిమితం కావడంతో ఎక్స్‌క్లూజివ్ తెలుగు మార్కెట్‌లో త్రివిక్రమ్, కొరటాల శివ ఇద్దరే టాప్ డైరెక్టర్స్. అగ్ర హీరోలందరూ వీరితో సినిమా చేయడం కోసం ఎదురు చూస్తారంటే…

రాజమౌళి కేవలం పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే పరిమితం కావడంతో ఎక్స్‌క్లూజివ్ తెలుగు మార్కెట్‌లో త్రివిక్రమ్, కొరటాల శివ ఇద్దరే టాప్ డైరెక్టర్స్. అగ్ర హీరోలందరూ వీరితో సినిమా చేయడం కోసం ఎదురు చూస్తారంటే వాళ్లకున్న క్రెడిబులిటీ అలాంటిది. త్రివిక్రమ్ చాలా కాలంగా తన సినిమాలన్నీ ఒకే సంస్థకి చేస్తోన్నాడు. హారిక హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ భాగస్వామ్యమయినా లేకుండా త్రివిక్రమ్ సినిమా రావడం లేదు.

వేరే నిర్మాణ సంస్థలతో ఎప్పుడో చేసుకున్న ఒప్పందాలను కూడా అడ్వాన్సులు తిరిగి ఇచ్చేసి మరీ త్రివిక్రమ్ కాన్సిల్ చేసేసుకున్నాడు. హా.హా.కు త్రివిక్రమ్ మాదిరిగా మైత్రి మూవీస్ కూడా కొరటాల శివను పర్మినెంట్ ఫీచర్ చేయాలని ఆశ పడింది. కానీ ఆ అవకాశాన్ని కొరటాల శివ వారికివ్వడం లేదు.

తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌ని అల్లు అర్జున్ సినిమాతో నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు కొరటాల శివ. ఇకపై తాను తీసే సినిమాలన్నిటికీ ఇతనే నిర్మాతగా వుంటాడట. త్రివిక్రమ్ మాదిరిగానే వేరే సంస్థ కలవాల్సి వస్తే సుధాకర్‌తో భాగస్వామ్యం తీసుకోవాలట. మైత్రి మూవీస్ కోసం కొరటాల శివ మరో సినిమా చేయాల్సి వుంది. వారికి కూడా ఇలా పార్టనర్‌షిప్ ఇస్తాడో లేక త్రివిక్రమ్ మాదిరిగా అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేస్తాడో మరి.

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?