పెళ్లి వేడుకల్లో రానా-మిహీకా తర్వాత ఆ స్థాయిలో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న భామ సమంత. ఫొటోలు, వీడియోలు బయటకు రాకపోయినా వేడుకల్లో సమంత ఓ రేంజ్ లో హంగామా చేస్తోందట. ఈ సంగతి పక్కనపెడితే.. తాజాగా జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలో సమంత వేసుకున్న డ్రెస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు రావడంతో ఆ డ్రెస్ పై ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది.
రానా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ కు ఎల్లో కలర్ డిజైనరీ డ్రెస్ వేసుకుంది సమంత. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా ఈ డ్రెస్ ను సమంత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది. చూడ్డానికి సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ఇందులో చాలా వర్క్ దాగుంది. చమ్కీలు, అద్దాలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కలర్ మిక్సింగ్.. ఇలా చాలా వ్యవహారం ఉంది ఇందులో.
దీంతో ఈ డ్రెస్ ఖరీదు ఎంత ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ డ్రెస్ కోసం సమంత అటుఇటుగా 2 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. కేవలం డ్రెస్ కోసం మాత్రమే ఈ రేటు. దుస్తులతో పాటు ఆమె వేసుకున్న యాక్ససరీస్ ది మళ్లీ ఎక్స్ ట్రా ధర.
అర్పితా మెహతా అనే ఈ డిజైనర్ కామన్ గా తన స్టోర్ లో, ఆన్ లైన్ పోర్టల్ లో పెట్టే దుస్తుల ధరలే లక్షకు పైగా ఉంటాయి. సెలబ్రిటీలు అందరికీ అందుబాటులో ఉండే డిజైన్లు అవి. అలాంటిది ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేస్తే, రేటు 2 లక్షలు ఉండడంలో ఆశ్చర్యం లేదు.
రానా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ కే సమంత ఇంత ఖరీదైన డ్రెస్ వేసుకుందంటే.. ఇక ఈరోజు పెళ్లికి ఇంకెంత కాస్ట్ లీ డ్రెస్ వేసుకుందో!