Advertisement

Advertisement


Home > Movies - Movie News

శ్రేయాస్ ఏటిటి విస్తరణ

శ్రేయాస్ ఏటిటి విస్తరణ

తొలిసారి తెలుగులో ఏటిటి అనే కాన్సెప్ట్ ను, టైటిల్ ను ఇంట్రడ్యూస్ చేసి, దాన్ని ఎలాగైనా సక్సెస్ బాటలో నడపాలని ప్రయత్నిస్తోంది శ్రేయాస్ ఇటి. తెలుగులో కొన్ని షార్ట్ మూవీస్ విడుదల చేసిన తరువాత కన్నడం మీదుగా ఇతర భాషల్లోకి వెళ్తోంది. కన్నడంలో ఓ సినిమా విడుదల చేస్తూనే తెలుగులో కూడా మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తోంది.

అందులో భాగంగా  ఆఫ్రీన్ సిద్ధు, నాస్టియా రాయ్, నిశాంత్ వాలియా, ఆర్జే పృథ్వీ తదితరులు నటించిన చిత్రం బ్లూ ఐస్ చిత్రాన్ని ఎటిటిలో అందించబోతోంది. మాదల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రాజేష్ మూర్తి దర్శకుడు. ఒక అమ్మాయి మరణ రహస్యాన్ని పరిశోధించడమే సినిమా లైన్.  ఇదివరకే కన్నడ రిలీజైన బ్లూ ఐస్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇక తెలుగు ఆడియెన్స్ ని కూడా థ్రిల్ చేయడానికి శ్రేయాస్ ఏటిటి లోకి రాబోతోంది. 

ఇది కాక దర్శకుడు ఆర్జీవీ అందిస్తున్న థ్రిల్లర్ సినిమా కూడా విడుదల కు రెడీ అవుతోంది. అలాగే ఆర్జీవీ అందించే చాలా సినిమాలు శ్రేయాస్ ఏటిటి లో విడుదలవుతాయి.

నిమ్మగడ్డకి పదవొచ్చింది పని లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?