విశాఖ విషయంలో చంద్రబాబుది మొసలి కన్నీరా. నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాలో వెంకటేష్ పాత్ర అంటుంది బీయ్యే, బీకాం, బీఎస్సీ. ఎమ్మెస్సీ, ఐఏఎస్ ఇలా చాలా చదవాలనుకున్నానని, కానీ చివరకు ఏమీ చదవలేదని పంచ్ వేస్తుంది. చంద్ర్రబాబు కూడా సేమ్ టూ సేమ్. ఎందుకంటే విశాఖను అలా ఇలా చేయాలనుకున్నాను అని ఎన్నో గొప్ప కబుర్లు చెబుతారే తప్ప చేసింది శూన్యం.
ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్ళు, తాజాగా మరో అయిదేళ్ళు ఇలా ముమ్మారు సీఎంగా సుదీర్ఘ కాలం అధికారం వెలగబెట్టినా కూడా బాబు విశాఖకు చూపించింది రిక్త హస్తమే. అందుకే ఆయన మీద వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ గట్టిగానే తగులుకున్నారు.
బంగారం లాంటి అధికారం చేతిలో పెడితే విశాఖకు ఏం చేశావు బాబూ అంటూ సూటిగానే ప్రశ్నించారు. టూరిజం కోసం చేసిందేంటి, విశాఖను ఆర్ధిక రాజధానిగా చేసేందుకు ఖర్చు చేసిన నిధులెన్ని ఇలా అవంతి ప్రశ్నల వర్షం కురిపించేశారు.
విశాఖ మీద మీకున్నది ప్రేమ కాదు, కేవలం మొసలి కన్నీళ్ళు మాత్రమేనని కూడా సెటైర్లు వేశారు. అమరావతిలో మీ సంగతి తెలిసే లోకేష్ ని జనాలు ఓడించారని కూడా అన్నారు. విశాఖకు రాజధాని అవసరమో కాదో తేల్చుకోవడానికి మేము సిధ్ధం, మీ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి అంటూ బాబుకు సరైన సవాల్ విసిరారు.
అమరావతిని తాము తక్కువ చేయలేదని, శాసనరాజధానిగా చేశామని, మరో రెండు కీలక ప్రాంతాలను అభివ్రుద్ధ్ధి చేస్తామంటే బాబుకు ఎందుకు అంత బాధ అని కూడా అవంతి నిగ్గదీశారు. నిజమే కదా మంగళగిరిలో లోకేష్ ని ఓడిస్తే అక్కడ రాజధాని పెట్టమంటున్నారు, విశాఖలో నలుగురిని గెలిపిస్తే ఇక్కడ రాజధాని వద్దు అంటున్నారు. బాబు రాజకీయమంతా దేని గురించే చెప్పాలని వైసెపీ నేతలు డిమాండ్ చేయడంలో తప్పులేదేమో.