పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో తెలియదు కానీ, క్రిష్ కథ ఓకె అయిందని, సినిమా నిర్మాత ఎఎమ్ రత్నం అని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ కథ చెప్పడం, విజయవాడ వెళ్లి మరీ మాట్లాడిరావడం అంతా ఒకె కానీ, పవన్ కళ్యాణ్ నిజంగా సినిమా చేస్తారా? చేస్తే ఏ సినిమా చేస్తారు? ఎవరి సినిమా చేస్తారు? అన్న అనుమానాలు ఇంకా అలాగే వున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం క్రిష్ కథ ఓకె చేసారు కానీ పవన్ ఇమ్మీడియట్ గా చేయబోయే సినిమా అది కాదని తెలుస్తోంది. ఆ సినిమా చేసే అవకాశం వుంది కానీ అంతకు ముందుగా తమిళ 'పింక్' సినిమా రీమేక్ నే ఎంచుకునే అవకాశం ఎక్కువ వుందని తెలుస్తోంది.
ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వుంటారు. దిల్ రాజుతో పాటు మరో భాగస్వామి కూడా వుండే అవకాశం వుందని వినిపిస్తోంది. అయితే అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఓకె అంటారు? ఎప్పుడు చేస్తారు అన్నది మాత్రం ఇప్పటికి అయితే తెలియదు. ఆయన ఫిక్స్ అయితే మాత్రం పింక్ రీమేక్ నే ఫస్ట్ ప్లేస్ లో వుండే అవకాశం వుందని తెలుస్తోంది.