డైవొర్స్ దిశగా డైరక్టర్

ఆయనో ప్రామిసింగ్ డైరక్టర్. మాంచి హిట్ తో ఇండస్ట్రీలోకి దూసుకువచ్చాడు. ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయినే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఒకటీ, అరా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సినిమాల సంగతి ఎలా వున్నా, ఇండస్ట్రీలో కాస్త…

ఆయనో ప్రామిసింగ్ డైరక్టర్. మాంచి హిట్ తో ఇండస్ట్రీలోకి దూసుకువచ్చాడు. ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయినే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఒకటీ, అరా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సినిమాల సంగతి ఎలా వున్నా, ఇండస్ట్రీలో కాస్త పేరు అయితే సంపాదించుకున్నాడు. 

కానీ అంతా బాగుంది అనుకుంటే వైవాహిక జీవితం మాత్రం ఫెయిల్ అయిందని తెలుస్తోంది. భార్య బై బై చెప్పి వెళ్లిపోయింది. విడాకుల దిశగా జీవితం సాగిపోతోందని బోగట్టా. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వ్యవహారం కాస్త పెయిన్ ఫుల్ నే. 

నిన్నే విడుదలయింది బ్యాచులర్ సినిమా. కాపురానికి సర్దుబాటు కావాలని పెద్దలు అంటే కాదు..రొమాన్స్ కావాలనే కొత్త జడ్జ్ మెంట్ ఇస్తూ. ఈ రొమాన్స్ పుష్కలంగా వున్న చైతూ-శామ్ ల మారిటల్ లైఫ్ బ్రేకప్ అయింది. 

అది లేకనే ఏమో ఈ డైరక్టర్ లైఫూ బ్రేకప్ దిశగా వెళ్లిపోతోంది. సర్దుబాటు అనే అసలు సిసలు సక్సెస్ మంత్ర యేమో కాపురానికి?