Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ కల్యాణ్ కంటే హీరో విజయ్ సూపర్..!

పవన్ కల్యాణ్ కంటే హీరో విజయ్ సూపర్..!

పవర్ స్టార్ అనే క్రేజ్ తో జనసేన పార్టీ పెట్టి బొక్కబోర్లా పడ్డారు పవన్ కల్యాణ్. ఇప్పుడు కులాల లెక్కలేసుకుని ఓట్ల కోసం ఫీట్లు చేస్తున్నారు. తమిళనాడులో ఇళయ దళపతి విజయ్ కూడా పార్టీ పెడతారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో పార్టీ అంటూ ఆయన తండ్రి హడావిడి చేసినా చివరకు విజయ్ ఆయనపైనే కేసు పెట్టి షాకిచ్చారు. 

అభిమానుల్ని కేవలం అభిమాన సంఘాలకే పరిమితం చేశారు. కానీ ఇటీవల తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయ్ అభిమాన సంఘాల పేరు చెప్పుకుని స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగి విజయ ఢంకా మోగించారు. మొత్తం 169 స్థానాల్లో పోటీ చేసిన అభిమానులు ఏకంగా 115 స్థానాల్లో గెలిచారు. దీంతో విజయ్ తో కంపేర్ చేస్తూ పవన్ కల్యాణ్ ని ఏకిపారేస్తోంది సోషల్ మీడియా.

పార్టీ లేకుండా గెలిచి చూపించారు..

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కాంత్, కమల్ హాసన్.. అంతా డక్కామొక్కీలు తింటున్నారు. ఈ దశలో విజయ్ తెరపైకి వస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ విజయ్ అభిమానులు మాత్రం సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ పవర్ స్టార్ అభిమానులు కేవలం సీఎం సీఎం అనే స్లోగన్లకే పరిమితం అయితే, అక్కడ ఇళయ దళపతి అభిమానులు మాత్రం ఏకంగా ఓట్లు, సీట్లతో అదరగొట్టారు. విజయ్ కు ఇష్టం లేకపోయినా, ఆయన కోసం ఓ రాజకీయ మార్గం రెడీ చేశారు.

'విజయ్ మక్కల్ ఇయక్కం' అనే పేరుతో హీరో విజయ్ కి అభిమాన సంఘం ఉంది. ఇప్పటివరకూ ఈ సంఘం తరపున సేవా కార్యక్రమాలు చేస్తుండేవారు, రాజకీయల జోలికి అభిమానులు వెళ్లలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తారనే వార్తలు వినిపించినా వాటన్నిటికీ ఎక్కడికక్కడ చెక్ పెట్టుకుంటూ వచ్చారు ఇళయ దళపతి. 

అభిమానుల్ని పూర్తిగా కంట్రోల్ లో ఉంచుకున్నారు. అయితే ఈసారి మాత్రం అభిమానులకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్.  అలా స్వతంత్ర అభ్యర్థులుగా అభిమానులు బరిలో దిగి తమ సత్తా చాటారు.

ఎవరి అభిమానులు గొప్ప..

అభిమాన హీరోని రెండు స్థానాల్లో ఒక్క చోట కూడా గెలిపించుకోలేని పవన్ కల్యాణ్ అభిమానులు గొప్పా, పార్టీ పెట్టకుండానే పోటీ చేసిన స్థానాల్లో 90శాతం చేజిక్కించుకున్న విజయ్ అభిమానులు గొప్పా అనే లెక్కలు తీస్తే.. కచ్చితంగా విజయ్ అభిమానులకే మార్కులివ్వాలి. సీఎం సీఎం అంటూ గోల చేయడం మినహా ఏపీలో పవన్ అభిమానులు చేసింది, చేస్తున్నదేమీ లేదు. 

ఇటీవల స్థానిక ఎన్నికల్లో కొద్దోగొప్పో సీట్లు వచ్చినా.. అక్కడ టీడీపీ, జనసేన కలసి ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమిళనాడులో మాత్రం విజయ్ అభిమానులు సింగిల్ గా బరిలో దిగి తమ సత్తా చాటారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే కచ్చితంగా తాను అనుకున్న టార్గెట్ సాధిస్తామని పరోక్షంగా నిరూపించుకున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?