Advertisement

Advertisement


Home > Movies - Movie News

నికిత పుడుతుందనుకుంటే అఖిల్ పుట్టాడు

నికిత పుడుతుందనుకుంటే అఖిల్ పుట్టాడు

పొరపాటున అమ్మాయిగా పుట్టింది కానీ బుద్ధులన్నీ అబ్బాయివే అంటుంటారు. కొంతమంది అబ్బాయిలకు కూడా రివర్స్ లో ఇలా కామెంట్ చేస్తుంటారు. అయితే హీరో అఖిల్ విషయంలో మాత్రం ఇది నిజంగానే జరిగింది. అమ్మాయి పుడుతుందని ఆశగా ఎదురుచూసిన నాగార్జునకు, అఖిల్ దర్శనమిచ్చాడు. ఇది నిజంగా జరిగిన ఘటన.

"అమ్మాయి పుడుతుందని మా నాన్న (నాగార్జున) ఆశపడ్డారు. అమెరికాలో అమ్మకు టెస్టులు చేస్తే అమ్మాయే అని చెప్పారు. దాంతో నాన్న ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. ఎందుకంటే, నాన్నక ముందు నుంచి అమ్మాయి కావాలని కోరుకున్నారు. డాక్టర్లు చెప్పడంతో ఇక ఫిక్స్ అయిపోయారు. పాప కోసం ఫ్రాక్స్, గౌన్లు లాంటి బట్టలు కొన్నారు. నేను పుట్టకముందే ఇండియాకి రిటర్న్ టికెట్ బుక్ చేశారు. అందులో నికిత అనే పేరు రాశారు. అలా నాకు పేరు కూడా పెట్టేశారు. కట్ చేస్తే, డెలివరీ రూమ్ లో నేను అబ్బాయి అని తెలిసింది. దాంతో నాన్న షాక్."

ఇలా తన బర్త్ సీక్రెట్ ను బయటపెట్టాడు అఖిల్. ఇప్పటికీ నాన్న, ఫ్యామిలీ సర్కిల్ లో ఈ విషయాన్ని చెబుతూ సరదాగా నవ్వుకుంటారట. అమెరికా లాంటి దేశంలో కూడా ఇలా లింగ నిర్థారణ విషయంలో తప్పులు జరుగుతాయనే విషయం కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. అఖిల్ జీవితంలో అది నిజంగానే జరిగింది. 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖిల్.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ఏజెంట్ సినిమాపై పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం ఏడాదిన్నరగా బాడీ బిల్డప్ చేశానని, ప్రారంభంలో కాస్త ఇబ్బంది అనిపించినప్పటికీ ప్రస్తుతం ఈ లైఫ్ స్టయిల్ ను ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?