రాజశేఖర్ నుంచి సుమంత్ కు?

కల్కి సినిమా తరువాత హీరో రాజశేఖర్ సినిమా ఏదీ ఇంకా స్టార్ట్ కాలేదు. అంతకుముందు గరుడవేగ తరువాత కూడా ఇలాగే చాలా టైమ్ పట్టింది. కల్కి సినిమా తరువాత రెండు మూడు ప్రాజెక్టులు వినిపించాయి.…

కల్కి సినిమా తరువాత హీరో రాజశేఖర్ సినిమా ఏదీ ఇంకా స్టార్ట్ కాలేదు. అంతకుముందు గరుడవేగ తరువాత కూడా ఇలాగే చాలా టైమ్ పట్టింది. కల్కి సినిమా తరువాత రెండు మూడు ప్రాజెక్టులు వినిపించాయి. అందులో తమిళ నిర్మాతల ప్రాజెక్టు ఒకటి. ఇప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.

అయితే సినిమా పూర్తిగా క్యాన్సిల్ కాలేదు. హీరో మాత్రమే మారిపోయినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ కు బదులుగా సుమంత్ ను తీసుకుని ప్రాజెక్టు చేయబోతున్నట్లు బోగట్టా. ఈ సినిమాకు కన్నడంలో సూపర్ హిట్ అయిన కవుల్దారి అనే సినిమా ఆధారం. ఈ సినిమా పోలీస్ స్టోరీ. థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ.

మామూలుగా అయితే రాజశేఖర్ ఇలాంటి పాత్రలకు పెర్ ఫెక్ట్ సెట్. మరి ఏమయిందో? ఎందుకు మారిందో కానీ సినిమా ఇప్పుడు చేతులు మారి, సుమంత్ దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది. అనేక జోనర్లు ట్రయ్ చేసిన తరువాత సుమంత్ ఇప్పుడిప్పుడే కాస్త సెటిల్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ థ్రిల్లర్ తో సుమంత్ మరికాస్త సెటిల్ అయ్యే అవకాశం వుంది.

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!