సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న స్పిరిట్ సినిమాకు ఆ హీరో రికార్డు స్థాయి పారితోషికాన్ని పొందనున్నాడనే టాక్ వినిపిస్తోంది బాలీవుడ్ నుంచి. ఈ సినిమాకు ప్రభాస్ ఆల్ ఇండియా లెవల్లో హయ్యెస్ట్ రెమ్యూనిరేషన్ ను పొందుతున్నాడట. స్పిరిట్ గా ప్రభాస్ అందుకునే పారితోషికం అక్షరాలా 150 కోట్ల రూపాయలు అనేది బాలీవుడ్ ట్రేడ్ టాక్!
ఇప్పటికే బాలీవుడ్ లో వంద కోట్ల రూపాయలు, ఆ స్థాయి రెమ్యూనిరేషన్ ను పొందుతున్న స్టార్ హీరోలు పలువురున్నారు. అయితే వారిని మించి ప్రభాస్ రెమ్యూనిరేషన్ పొందుతున్నాడనేది లేటెస్ట్ బీ టౌన్ టాక్. ప్రభాస్ సినిమాకు హిందీ బెల్ట్ లో భారీ స్థాయి ఓపెనింగ్స్ సాధ్యం అయ్యే పరిస్థితి నెలకొంది. దానికి తోడు.. తెలుగు మార్కెట్ భారీ స్థాయిలో ఉన్నట్టే.
ఇక బాహుబలి ఇమేజ్ తో .. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ప్రభాస్ సినిమాల విడుదలకు రాజమార్గం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఈ మార్కెట్ రేంజ్ తో ప్రభాస్ రెమ్యూనిరేషన్ పతాక స్థాయికి చేరిందని బాలీవుడ్ సినిమా పత్రికలు చెబుతున్నాయి. స్పిరిట్ సినిమాను టీ సీరిస్ నిర్మిస్తూ ఉంది. దర్శకుడు సందీప్ కు చెందిన నిర్మాణ సంస్థ కూడా పార్ట్ నర్ గా ఉంది.
స్థూలంగా అత్యంత భారీ స్థాయి పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోగా నిలుస్తున్నాడు ప్రభాస్.