కేబినెట్ లో ఆమోదించిన అంశాలివే!

నిన్న మధ్యాహ్నం మొదలైన తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది. రాత్రి 11 గంటల వరకు నడిచిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Advertisement నూతన…

నిన్న మధ్యాహ్నం మొదలైన తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది. రాత్రి 11 గంటల వరకు నడిచిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నూతన సచివాలయం డిజైన్, బడ్జెట్ అనే అంశంతో ప్రారంభమైన కేబినెట్ మీటింగ్.. కొత్త డిజైన్ కు ఆమోదముద్ర వేసింది. గత 2 వారాలుగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డిజైన్ పై వర్క్ చేశారు. నిపుణులతో సంప్రదించి అన్ని రకాల మార్పుచేర్పులు చేశారు. మరీ ముఖ్యంగా వాస్తు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా డిజైన్ రూపొందించారు. అలా ముఖ్యమంత్రి కనుసన్నల్లో రూపుదిద్దుకున్న నూతన సచివాలయం డిజైన్ ను వెంటనే కేబినెట్ ఆమోదించింది.

మరోవైపు కరోనా నివారణ చర్యలకు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. ఇకపై కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని నేరుగా హాస్పిటల్ లో జాయిన్ చేసుకోరు. ముందుగా బాధితుడ్ని హోమ్ ఐసోలేషన్ లో ఉంచుతారు. ఈ మేరకు 10 లక్షల హోమ్ ఐసొలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది. హోమ్ ఐసొలేషన్ తర్వాత కూడా సమస్యలు ఎదురైతే, అప్పుడు హాస్పిటల్ కు షిఫ్ట్ చేస్తారు.

కరోనా పరీక్షల విషయంలో ఎదురవుతున్న విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై రోజుకు 40వేల వరకు నిర్థారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే కేటాయించిన బడ్జెట్ కు అదనంగా మరో 100 కోట్ల రూపాయల గ్రాంట్ ను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వివిధ వైద్యసేవలతో పాటు 10వేల ఆక్సిజన్ బెడ్ల ఏర్పాట్లకు ఈ నిధులు ఉపయోగిస్తారు.

మరోవైపు పాఠశాల విద్యపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. కేంద్రం మార్గదర్శకాలకు తగ్గట్టు విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి దూరదర్శన్ ను వినియోగించుకోవాలని నిర్ణయించిన కేబినెట్.. షెడ్యూల్ ను ఖరారు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. దీంతో పాటు అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ తయారుచేయాలని ఆదేశించింది.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో విధిస్తున్న కోతపై కేబినెట్ లో చర్చించలేదు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచే అంశంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇలా చేస్తే కరోనా రాదు