తెలంగాణ ఉద్యమం.. అమరావతి ఉద్యమం ఒకటేనా!

ఉద్యమం అంటే నాయకుడు ఉండాలి, ఆ నాయకుడు ఉద్యమానికి ముందుండాలి, దాన్ని సరైన దారిలో నడిపించాలి. అవసరమైతే ప్రజల కోసం త్యాగాలు చేయాలి. మరి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ చేస్తున్న ఆందోళన నిజమైన…

ఉద్యమం అంటే నాయకుడు ఉండాలి, ఆ నాయకుడు ఉద్యమానికి ముందుండాలి, దాన్ని సరైన దారిలో నడిపించాలి. అవసరమైతే ప్రజల కోసం త్యాగాలు చేయాలి. మరి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ చేస్తున్న ఆందోళన నిజమైన ఉద్యమమేనా? ఉద్యమమే అయితే నాయకుడెవరు? చంద్రబాబా, పవన్ కల్యాణా, సోము వీర్రాజా? పోనీ ఆ నాయకుడు సోషల్ మీడియా నుంచి ప్రజల మధ్యకు ఎప్పుడొస్తారు? వీటిలో వేటికీ సమాధానం దొరకదు.

అంటే అసలు అమరావతి గొడవ ఉద్యమమే కాదని అర్థమవుతోంది. ఉద్యమమే కానప్పుడు ఇక ఆ ఆందోళన గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాల సమాహారం. ఇందులో కేవలం 2 జిల్లాలకు మాత్రమే, ఆ జిల్లాలలోనూ కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితమైన సమస్య ఇది.

తెలంగాణ ఉద్యమం ఏకంగా ఆ ప్రాంతమంతా బలంగా వినిపించింది. మహా అయితే ఖమ్మం లాంటి ఏపీ సరిహద్దులు ఉన్నచోట్ల కాస్త ఆందోళనలు తగ్గినా తెలంగాణ వ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో ఒకే డిమాండ్, ఒకే భావోద్వేగం కనిపించింది. అందుకే ప్రత్యేక రాష్ట్రం వారికి సాధ్యపడింది. మరి ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితులున్నాయా? అమరావతి సమస్యను రాష్ట్ర విభజన సందర్భంతో పోల్చి చెప్పిన చంద్రబాబుకి వాటిమధ్య వైరుధ్యాలు తెలియదా? అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర విభజన సందర్భంతో పోల్చిన చంద్రబాబుకు బుద్ధిలేదనే విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

రాజధాని సమస్య కేవలం కొన్ని గ్రామాల ఆందోళనగానే మిగిలిపోయింది. మిగతా 11 జిల్లాల ప్రజలు ముక్త కంఠంతో అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని కోరుకుంటున్నారు. బాబు అడుగులకు మడుగులొత్తే చేతకాని నేతలు మాత్రమే రాయలసీమలో, ఉత్తరాంధ్రలో ఉండి కూడా సొంత ప్రాంత అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు.

ఇలాంటి బానిసల సంగతి పక్కనపెడితే.. రాష్ట్రం మొత్తం ముక్తకంఠంతో మూడు రాజధానులు సమ్మతమేనంటోంది. చంద్రబాబు ఇంకా బుకాయిస్తే.. రాష్ట్ర ప్రజలంతా మొత్తం ఏకతాటిపైకి వచ్చి రోడ్డెక్కుతారు, అయితే బాబు అనుకున్నట్టు అమరావతికి మద్దతుగా కాదు, మూడు రాజధానులకు అనుకూలంగా.

అదే జరిగితే ఇక బాబు పరిస్థితి గల్లంతే. ఇప్పటి వరకూ నాయకుడు లేని ఉద్యమం, ఇకపై జనం లేని ప్రజా ఉద్యమంగా మిగిలిపోతుంది. 

ఇలా చేస్తే కరోనా రాదు