అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. పైగా అనుమానం

చేసిందే తప్పుడు పని. అందులో మళ్లీ అనుమానం ఒకటి. ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్న వివాహేతర సంబంధంలో కూడా అనుమానించాడు. ఆ అనుమానమే పెనుభూతమై ఏకంగా మహిళ ప్రాణాలు…

చేసిందే తప్పుడు పని. అందులో మళ్లీ అనుమానం ఒకటి. ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్న వివాహేతర సంబంధంలో కూడా అనుమానించాడు. ఆ అనుమానమే పెనుభూతమై ఏకంగా మహిళ ప్రాణాలు తీసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో ఈ ఘటన జరిగింది.

తాడేపల్లిగూడెంకు చెందిన రామలక్ష్మి భర్తతో విడిపోయింది. పిల్లలో కలిసి ఉంగుటూరు వచ్చి నివశిస్తోంది. ఇంటి పక్కనే ఉన్న సూర్యారావుతో ఆమెకు అనుబంధం ఏర్పడింది. మూడేళ్లుగా వీళ్లు తమ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే తనతో అక్రమ సంబంధంలో ఉన్న రామలక్ష్మి.. మరో వ్యక్తితో కూడా కాంటాక్ట్ లోకి వెళ్లిందనే అనుమానం వచ్చింది సూర్యారావుకి. రోజురోజుకు ఆ అనుమానం పెరిగి, ఏకంగా రామలక్ష్మిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఓరోజు ఉదయం రామలక్ష్మిని తీసుకొని సమీపంలోకి అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడే ఆమెను గొంతునులిమి చంపేశాడు. అంతేకాదు, తను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. సూర్యారావును హాస్పిటల్ లో జాయిన్ చేసిన పోలీసులు, రామలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. 

ఇలా చేస్తే కరోనా రాదు